we searched for colour stones says shraddha das

Shraddha das shares her attachment with uttarpradesh raebareli

actress shraddha das, shraddha das, shraddha das latest news, shraddha das movies, shraddha das photos, shraddha das forth comming movie, shraddha das movie collections, shraddha das latest updates, shraddha das movie news, shraddha das cinema News, shraddha das upcomming movies, shraddha das marriage news,

shraddha das shares her attachment with uttarpradesh raebareli in her childhood, says she with other children searched for colour stones in hiily areas

రంగురాళ్ల వేట జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం

Posted: 05/10/2015 05:15 PM IST
Shraddha das shares her attachment with uttarpradesh raebareli

ఆర్య, సిద్దు ఫ్రం శ్రీకాకుళం, మొగుడు, రేయ్ చిత్రాలతో తెలుగులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రద్దాదాస్. ప్రత్యేక పాత్రలతో కుర్రకారును ఆకట్టుకోవడంలో ఆమెకు తిరుగులేదు. పుట్టి పెరిగింది ముంబైలో అయినప్పటికీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని అమె తెలపింది. తాను పుట్టి పెరిగింది, విద్యాభ్యాసం, కెరీర్ అంతా ముంబయి అయినప్పటికీ రాయ్‌బరేలీతో మాత్రం విడదీయని అనుబంధం ఉందని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆ జిల్లాలోనే మా అమ్మమ్మ వాళ్ల ఊరుంది. అందుకే ఆ జిల్లాతో తనకు విడదీయలేని అనుబంధం వుందని శ్రద్దా తెలిపింది.

ప్రతి వేసవిలో ఇంటిల్లిపాది రాయ్ బరేలికి వెళ్లేవాళ్లమని.. తమది. చాలా పెద్ద కుటుంబమని.. పిన్నా పెద్దా అంతా కలిసి సుమారు పాతికి మందికి పైగానే వుండేవాళ్లమని చెప్పింది. అమ్మమ్మ వాళ్ల ఇల్లు కూడా ఎంతో విశాలంగా ఉండేదని. ఇంట్లోనే అన్ని సదుపాయాలు ఉండేవని తెలిపింది. పాడి పశువులు బాగా ఉండేవి. పాలు, పెరుగు, వెన్న, జున్ను అంతా అమ్మమ్మ వాళ్లింట్లోనే లభించేవని.. వాటిని ఆస్వాదిస్తూ... వేసవి సెలవులను బాగా ఎంజాయ్ చేసేవాళ్లమని తెలిపింది అమ్మాడు.

పొద్దంతా ఆటలే ఆటలతో బిజీగా వుంటే తమకు చాట్, సమోసాలతో పాటు రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడూ తమకోసం సిద్ధంగా ఉండేవని చెప్పింది. ఇదంతా ఒకవైపు.. మరోవైపు రంగురాళ్ల కోసం సాగించే అన్వేషణ. బరేలీలో వేల రకాల రంగురాళ్లు లభించేవి. వాటి కోసం కొండలు, గుట్టలు తిరిగేవాళ్లమని. రంగురాళ్లను కనిపెట్టడం వాటిని ఇంటికి తెచ్చుకోవడం ఎంతో సరదాగా ఉండేదని చెప్పింది. ఆ రోజుల్లో. అలా పిల్లలమంతా కలిసి రంగురాళ్ల కోసం కొండలు, గుట్టల వెంట వెళ్తున్నప్పుడు వారితో ఎవరో ఒకరు పెద్దవాళ్లు ఉండేవాళ్లని... ఆ రంగురాళ్ల వేట తన జీవితంలో ఇప్పటికీ మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా నిలిచివుంటుందని చెప్పింది శ్రద్దాదాస్.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shraddha das  raebareli  uttar pradesh  Tollywood news  

Other Articles