Hearoine Ileana DCruz getting ready to marriage Ileana | Marriage | Dating | Ready | Andrew

Hearoine ileana dcruz getting ready to marriage

ileana, ileana marriage, ileana news. ileana updates, ileana twitter, ileana love, ileana dating, ileana movies, ileana wallpapers

Hearoine Ileana DCruz getting ready to marriage.ileane and andrew nebone dating from last one year. They are getting ready to marriage soon.

నాకు ఆ టైం వచ్చేసిందంటున్న గోవా బ్యూటీ

Posted: 04/26/2015 06:19 PM IST
Hearoine ileana dcruz getting ready to marriage

దక్షిణాది నుంచి బాలీవుడ్ లోకి అరేంగ్రేటం చేసి తన సత్తా చాటుకున్న గోవా బ్యూటీ ఇలియానాకు ఆ టైం వచ్చేసిందటండీ.. ఏం టైం అంటూ అలోచిస్తున్నారా.?  ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ అండ్రూ నీబోన్‌తో చాలాకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ బ్యూటీకి త్వరలోనే శుభవార్త చెబుతానంటోంది. గతంలో అతనితో కలిసి పలు సినిమా వేడుకల్లో దర్శనమిచ్చింది ఈ సుందరి. అయితే ఈ ప్రేమ బంధాన్ని గురించి ఇలియానా ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తోన్న ఆమె త్వరలో అతన్ని పెళ్లాడబోతున్నట్లు తెలిసింది.వరుస వైఫల్యాల కారణంగా సినిమాలకు దూరమైన ఇలియానా చాలాకాలం తర్వాత తనకు లభించిన విరామ సమయాన్ని ప్రియుడితో గడుపుతూ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటోంది. విహారయాత్ర కోసం ఇటీవలే అండ్రూ స్వదేశం ఆస్ట్రేలియా వెళ్లిన ఈ జంట షికార్లలో మునిగితేలుతున్నారట.

ప్రియుడితో సరదాగా గడుపుతున్న కొన్ని ఫొటోలను ఇలియానా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇలియానాను తన కుటుంబ సభ్యులకు పరిచయం చేయడంతో పాటు పెళ్లి విషయమై చర్చించడానికే అండ్రూ తనతో పాటు తన ప్రేయసిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే వీరి పెళ్లికి ఇలియానా కుటుంబ సభ్యులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో ఈ జంట పెళ్లిపీటలెక్కటం ఖాయమని ఇలియానా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇలాయానా భలే ఎంజాయ్ చేస్తోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles