Allu Arjun Given Green Signal To Boyapati Srinu Project | Bollywood Heroine Amaira Dastur

Allu arjun boyapati srinu project bollywood heroine amaira dastur

Allu Arjun news, Allu Arjun movies, Allu Arjun boyapati srinu, Allu Arjun amaira dastur, Allu Arjun gossips, Allu Arjun movies lists, son of satyamurthy, amaira dastur news, amaira dastur hot photos, amaira dastur latest updates, Allu Arjun latest updates, boyapati srinu news

Allu Arjun Boyapati Srinu Project Bollywood Heroine Amaira Dastur : Finally Stylish Star Allu Arjun has given green signal to boyapati srinu to do next project. In this movie amaira dastur selected as first heroine.

బన్నీ పచ్చజెండా ఊపితే.. బాలీవుడ్ భామ దిగొచ్చింది!

Posted: 04/25/2015 10:25 AM IST
Allu arjun boyapati srinu project bollywood heroine amaira dastur

ఇటీవలే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. అప్పుడే తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం! గతకొంతకాలం నుంచి బోయపాటి దర్శకత్వంలో బన్నీ ఓ మూవీ చేయనున్నట్లుగా వార్తలు వెలువడిన విషయం తెలిసిందే! అయితే.. ఈ ప్రాజెక్టుపై ఎన్నో వార్తలు వచ్చాయి కానీ.. బన్నీ తరఫు నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అతడు ఈ సినిమా చేస్తాడా..? లేదా..? అసలు వీరిద్దరి ప్రాజెక్టు వుంటుందా..? లేదా..? అన్న సందేహాలు తీవ్రమయ్యాయి. పైగా ఈ మూవీ గురించి బన్నీని ప్రశ్నించగా.. దానికి అనుకూలంగా సమాధానం ఇవ్వలేదు. దీంతో వీరి కాంబో మూవీ లేనట్టేనని పుకార్లు చెలరేగాయి.

అయితే.. తాజాగా బోయపాటి వినిపించిన స్ర్కిప్టును విన్న బన్నీ ఈ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపేశాడని సమాచారం! ‘సత్యమూర్తి’ చిత్రం ఎలాగో భారీ విజయాన్ని అందుకుంది కాబట్టి.. ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. ఇక బన్నీ ఓకే చెప్పిన నేపథ్యంలో దర్శకుడు బోయపాటి ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలను మొదలుపెట్టినట్లు తెలిసింది. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ప్రీ - ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నట్లు ఇండస్ట్రీవర్గాల సమాచారం! ఇక ఈ మూవీలో బన్నీ ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్నాడు. ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ బన్నీ సరసన నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం!

మొదట్లో ఈ మూవీ కోసం ఎందరో హీరోయిన్లను పరిశీలించగా.. వారిలో ఓ హీరోయిన్ సెలెక్ట్ అయింది. ఆమె మరెవ్వరో కాదు.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ సరసన ‘మిస్టర్ ఎక్స్’ సినిమాలో నటించిన అమైరా దస్తూర్! ఈ అమ్మడు తమిళంలోనూ ధనుష్ సరసన ‘అనైకుడు’ చిత్రంలో నటించింది. ఇక మరో హీరోయిన్ కోసం యూనిట్ బృందం అన్వేషణలో మునిగినట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Boyapati Srinu  Amaira Dastur  Son Of Satyamurthy  

Other Articles