Bahubali Movie Units Released Sets Photographs to International Media | Tollywood News

Bahubali movie sets photos released international media

Bahubali movie, Bahubali movie news, Bahubali sets photos, Bahubali movie gallery, Bahubali photos, Bahubali photo shoot, Bahubali set photographs, Bahubali rana statue, Bahubali statues, Bahubali prabhas, Bahubali anushka, Bahubali tamannah, rajamouli news, rajamouli updates

Bahubali Movie Sets Photos Released International Media : The Historical Movie Bahubali Unit Has Released Sets Photographs to International Media which are mesmerizing everyone.

భళారే జక్కన్న.. అబ్బురపరుస్తున్న బాహుబలి ‘సెట్స్’ ఫోటోలు

Posted: 04/23/2015 01:30 PM IST
Bahubali movie sets photos released international media

గత రెండేళ్ల నుంచి దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘బాహుబలి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే! చారిత్రాత్మక కథనంతో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి జక్కన్న ఇంతవరకు ఫోటోలు లీక్ కానివ్వకుండా ఎన్నో జాగ్రత్తలు పాటించాడు. ఈ క్రమంలోనే షూటింగ్ సమయంలో అక్కడున్న క్రూ మెంబర్లతోపాటు నటీనటులు సైతం సెల్ ఫోన్లు లోపలికి ప్రవేశం వుండేది కాదు. ముఖ్యంగా భారీ వ్యయంతో నిర్మించిన సెట్స్ ఫోటోలు ఏమాత్రం బయటకు రానివ్వలేదు.

అయితే.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెట్స్ ఫోటోలు తాజాగా విడుదలయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారుచేసిన ఆన్ సెట్స్ చిత్రాలు ప్రతిఒక్కరినీ ‘ఔరా’ అనేలా అబ్బుపరుస్తాయి. ఇటీవల ‘బాహుబలి’ సెట్స్ ని అంతర్జాతీయ మీడియా బృందం సందర్శించింది. మూవీ చిత్రీకరణ కోసం తీర్చిదిద్దిన సెట్స్ ని చూసి వారు ఆశ్చర్యపోయారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆవిష్కరించిన వంద అడుగుల రాణా విగ్రహంతోపాటు ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, పురాతన కాలంనాటికి సంబంధించిన సెట్స్ ని బ్రహ్మాండంగా రూపొందించారు. ఇప్పుడు ఈ సెట్స్ కి సంబంధించిన వార్తకథనాలే మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Bahubali-Sets-10
Bahubali-Sets-11
bahubali-sets-13
bahubali-sets-14
bahubali-sets-15
bahubali-sets-16
bahubali-sets-17
bahubali-sets-18
bahubali-sets-19
Bahubali-Sets-2
bahubali-sets-20
bahubali-sets-21
bahubali-sets-22
bahubali-sets-23
bahubali-sets-24
bahubali-sets-25
bahubali-sets-26
Bahubali-Sets-3
Bahubali-Sets-4
Bahubali-Sets-5
Bahubali-Sets-6
Bahubali-Sets-7
Bahubali-Sets-8
Bahubali-Sets-9

ఈ ఫోటోలు చూసిన ప్రతిఒక్కరూ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని తెగ వెయిట్ చేస్తున్నారు. రాజుల కాలంలో వుండే లొకేషన్లను జక్కన్న మలిచిన తీరు మహాద్భుతం అని నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. కేవలం ఫోటోలు కళ్లు చెదిరేలా వుంటే.. ఇక సినిమా ఎంత బాగుంటుందోనని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం హాలీవుడ్ సినిమా రేంజిలో ఉంటుందని అంటున్నారు. తెలుగులో సినిమా చరిత్రలోనే ఇదొక అద్భుతమైన చిత్రంగా చెబుతున్నారు.

ఇక ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో ఆర్కా వర్క్స్ మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఈ మూవీ తొలి భాగాన్ని ‘బాహుబలి.. ది బిగినింగ్' పేరుతో వేసవిలో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక రెండోభాగాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahubali set photos  prabhas  anushka shetty  rajamouli  rana daggubati  

Other Articles

Today on Telugu Wishesh