Allu arjun Going Kerala To meet his fans | Son of satyamurthy malayalam version Promotions

Allu arjun twitter kerala son of satyamurthy malayalam version

allu arjun news, allu arjun kerala tour, allu arjun movies, allu arjun son of satyamurthy, son of satyamurthy collections, son of satyamurthy gossips, son of satyamurthy updates, son of satyamurthy latest news, allu arjun malayalam movies

Allu arjun twitter Kerala Son of satyamurthy malayalam version : Stylish star Allu Arjun going to kerala to meet his fans and promote his malayalam version Son of satyamurthy movie which creates new records in tollywood.

‘తండ్రి విలువ’ తెలిపేందుకు కేరళ వెళ్లిన బన్నీ

Posted: 04/21/2015 01:39 PM IST
Allu arjun twitter kerala son of satyamurthy malayalam version

ఇటీవలే ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. అందులో తండ్రి విలువ ఏంటో అందరికీ తెలియజేశాడు. ఏ విధంగా తల్లి పిల్లలను ఒడిలో చేర్చుకుని ఆలనాపాలనా చూసుకుంటుందో.. అదేవిధంగా తండ్రి తన పిల్లలకు జీవితపాఠాలు నేర్పించి వారిని గమ్యాన్ని చేరుస్తాడనే అంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ నిర్వచనాన్ని తెలుగు ప్రజలకు విశదీకరించిన బన్నీ.. ఇప్పుడు కేరళవారికి ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు పయనమయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. అల్లు అర్జున్ కి మలయాళ పరిశ్రమలో ఎంతమేర క్రేజ్ వుందో అందరికీ తెలిసిందే! తెలుగులో ఏ హీరోకూ లేనంత స్టార్‌డమ్ బన్నీకి మలయాళంలో వుంది. అక్కడ బన్నీకి ఇంత క్రేజ్ వుండటం వల్లే తెలుగు సినిమాలు మలయాళ భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తారు. ఇప్పటివరకు అక్కడ రిలీజైన బన్నీ సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఆ కోవలోనే S/O సత్యమూర్తి కూడా మళయాలంలో విడుదల కానుంది.

ఇప్పటికే మలయాళ డబ్బింగ్ వెర్షన్ కార్యక్రమాలు పూర్తికాగా.. ఏప్రిల్ 24న భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా వుంది. ఈ నేపథ్యంలోనే బన్నీ ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా కేరళలోని అభిమానులను కలుసుకునేందుకు పయనమయ్యాడు. అక్కడ ఫ్యాన్స్‌తో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని సినిమాకు మరింత ప్రచారం కల్పించే దిశగా అడుగులేస్తున్నాడు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఎకౌంట్‌లో ట్వీట్ చేస్తూ.. ‘కేరళలో అభిమానులను కలుసుకోవడానికి వెళ్ళడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది’ అని బన్నీ పేర్కొన్నాడు.

ఇదిలావుండగా.. ఈ సినిమా తెలుగులో 17వ తేదీన రిలీజై మంచి విజయం సాధించిన విషయం విదితమే! ఈ మూవీ విడుదలై రెండో వారమైనా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ మలయాళంలోనూ మంచి విజయం సాధించడంతోపాటు భారీ కలెక్షన్లను రాబట్టుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సన్నాఫ్ సత్యమూర్తిని అక్కడి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  son of satyamurthy  bunny kerala tour  

Other Articles