Telugu Music Director Sri aka Srinivasa Chakravarthy Dies of Kidney-Related Ailment

Music director sri passes away

music director sri passes away, Music Director Sri Is No More, Telugu Music Director Sri aka Srinivasa Chakravarthy, sri Dies of Kidney-Related Ailment, Music Director Sri Died, Music Director Sri,

Popular Tollywood musician Sri, Kommineni Srinivasa Chakravarthy, died at his residence in Hyderabad, He was suffering from some kidney-related ailment for a long time.

సంగీత దర్శకుడు శ్రీ కన్నుమూత

Posted: 04/19/2015 12:09 PM IST
Music director sri passes away

సంగీత దర్శకుడు శ్రీ  అలియాస్ కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి పరమపదించారు. శ్రీ గత కోంతకాలంగా కిడ్నీకి సంబంధించిన రుగ్మతతో బాధపడుతూ నిన్న సాయంత్రం కొండాపూర్లోని స్వగృహంలో కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుడు దివంగత చక్రవర్తి కుమారుడైన శ్రీ  గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన శ్రీ గత కొద్ది కాలంగా   ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీ  పోలీస్ బ్రదర్స్, గాయం, సింధూరం, అనగనగా ఒక రోజు, ఆడుమగాడ్రా బుజ్జీ, అమ్మోరు, మనీ, నీకే మనసిచ్చా, ఆవిడా మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, కాశీ, సాహసం తదితర 20 చిత్రాలకు సంగీతం అందించారు.

రామ్ గోపాల్ వర్మ, కృష్ణ వంశీలతో ఆయన ఎక్కవ చిత్రాలకు పని చేశారు.  శ్రీ కేవలం సంగీత దర్శకుడే కాదు, గాయకుడు, డబ్బింగ ఆర్టిస్ట్  కూడా.   2005లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందిన చక్రం చిత్రంలోని 'జగమంత కుటుంబం' పాటను ఆయనే పాడారు. ఆయన స్వరాలు అందించిన చివరి చిత్రం 'అప్పూ..ది క్రేజీ బోయ్' ఇది బాలల చిత్రం. ఇది విడుదల కావలసి ఉంది. శ్రీకి  భార్య అరుణ,  కుమారుడు రాజేష్ చక్రవర్తి ఉన్నారు. శ్రీనివాస చక్రవర్తి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస చక్రవర్తి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Music director Sri  Sri passes away  

Other Articles