Jagapathi Babu | New Look | Mahesh Babu | Srimanthudu

Jagapathi babu new look in srimanthudu

Jagapathi Babu New Look in Srimanthudu, Mahesh Babu Srimanthudu Teaser Release Date, Mahesh Babu Srimanthudu movie news, koratala shiva Srimanthudu Movie news, Srimanthudu Movie news, Srimanthudu Movie updates, Srimanthudu Movie shooting, Srimanthudu Movie details, Srimanthudu Movie heroine, Srimanthudu Movie stills, Mahesh Srimanthudu

Jagapathi Babu New Look in Srimanthudu: Mahesh Babu latest movie working title Srimanthudu. Directior koratala shiva. shruti hassan heroine. Jagapathi Babu New Look still released today.

వారెవ్వా జగ్గుభాయ్ లుక్ అదుర్స్... మహేష్ ను ఢీకొట్టే మరో శ్రీమంతుడు!

Posted: 04/16/2015 12:47 PM IST
Jagapathi babu new look in srimanthudu

స్టార్ హీరో జగపతి బాబు ఇటీవలే ‘లెజెండ్’ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన విషయం తెలిసిందే. ‘లెజెండ్’ సినిమాలో జగపతి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత జగపతి పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు.

ప్రస్తుతం మహేష్ హీరోగా నటిస్తున్న ‘శ్రీమంతుడు’(వర్కింగ్ టైటిల్) చిత్రంలో జగపతి బాబు ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో జగపతి బాబు ఏ పాత్రలో నటించబోతున్నాడనే విషయం ఇంకా తెలియరాలేదు. తాజాగా ఈ సినిమాలోని తన లుక్ కు సంబంధించిన ఓ ఫోటోను జగపతిబాబు తన సోషల్ మీడియా ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా విడుదల చేసారు.

జగపతి ఈ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూస్తుంటే మహేష్ కు ఢీ కొట్టే మరో శ్రీమంతుడిగా జగపతి పాత్ర వుండబోతున్నట్లుగా కనిపిస్తుంది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్నారు.

మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఫోటోలు, పోస్టర్లు, టైటిల్ లోగో, టీజర్లను మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున విడుదల చేయనున్నారు. జూన్ మొదటి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagapathi Babu  New Look  Mahesh Babu  Srimanthudu  

Other Articles