Murali mohan Comments on Maa Elections war

Murali mohan comments on maa elections war

Murali mohan Comments on Rajendhra prasad, Rajendra prasad Comments on Jayasudha panel, Rajendra prasad Comments on Jayasudha, Maa President Elections Cold War, maa president elections, dasari narayana rao, rajendra prasad, jayasudha, megabrother nagababu, murali mohan, maa elections news, maa elections controversy, maa elections updates, rajendra prasad updates, jayasudha updates, nagababu updates

Murali mohan Comments on Maa Elections war: actor uttej and shivajiraja withdrawn from rajendra prasad pannel due to some physical controversies

మా యుద్ధంపై మురళీమోహన్ స్పందన

Posted: 03/26/2015 10:10 AM IST
Murali mohan comments on maa elections war

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఒక వర్గం వారిపై మరొక వర్గం వారు విమర్శలు గుప్పించుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్ ప్యానెల్ సభ్యులు ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలకు కౌంటర్ గా జయసుధ ప్యానెల్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు, ప్రశ్నలు గుప్పించారు.

జయసుధ ప్యానెల్ సభ్యులు చేసిన కామెంట్లపై నిన్న రాజేంద్రప్రసాద్ ప్యానెల్ సభ్యులు రీ కౌంటర్ వేసారు. అంతేకాకుండా జయసుధ ప్యానెల్ వారికి రాజేంద్రప్రసాద్ ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘మా’ ఎన్నికల్లోకి రాజకీయాలను చేర్చి కంపు కంపు చేస్తున్నారంటూ ఎద్దేవ చేసారు.

అయితే నటుడు నాగబాబు, శివాజీరాజాలు మాత్రం తాము రాజేంద్రప్రసాద్ కే మద్ధతు పలుకుతామని స్పష్టం చేసారు. రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మురళీమోహన్ చాలా కలత చెందినట్లుగా ఆయన తెలిపారు.

ఈ విషయంపై మురళీమోహన్ స్పందిస్తూ... ‘మా’ కుటుంబంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని, ఈ విమర్శలు చేసుకోవడం కేవలం తాత్కాలికమేనని.. ఎన్నికలు జరిగితే అంతా సర్దుకుంటాయని అన్నారు. ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే వుద్దేశ్యంతోనే చాలా మందిని కోరినప్పటికి ఎవరూ ముందుకు రాలేరని... ఈలోపు రాజేంద్రప్రసాద్ తాను పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారని చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత జయసుధ వచ్చి మహిళలకు స్థానం ఇవ్వాలని కోరడంతో... ఆమెకు మద్ధతు ఇచ్చామని తెలిపారు. పెన్షన్లు ఇవ్వడం కంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆర్థిక సహయం చేయడం మంచిదనే వుద్దేశ్యంతో ఆనాడు అక్కినేని సూచనలతో పెన్షన్లను తగ్గించామని చెప్పుకొచ్చారు. రాజేంద్రప్రసాద్, జయసుధలలో ఎవరు గెలిచినా కూడా తనకు ఆనందమేనని, ‘మా’ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలనేదే తమ కోరికని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Murali mohan  Rajendra prasad  Comments  Jayasudha panel  Shivaji Raja  

Other Articles