Manchu vishnu dynamite movie motion poster

Manchu Vishnu Dynamite Motion Poster, Manchu Vishnu Dynamite Poster, Dynamite Motion Poster, Manchu Vishnu movie Dynamite, Manchu Vishnu Dynamite, Manchu Vishnu Dynamite movie news, Manchu Vishnu Dynamite stills, Manchu Vishnu Dynamite news, Vishnu Dynamite

Manchu Vishnu Dynamite Movie Motion Poster: Manchu Vishnu doing a movie under Deva katta direction. movie title is Dynamite. This Movie First look poster released.

మంచు విష్ణు డైనమైట్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

Posted: 03/20/2015 10:14 AM IST
Manchu vishnu dynamite movie motion poster

తమిళంలో విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్ జంటగా నటించిన చిత్రం ‘అరిమనంబి’. ఈ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. నటుడిగా విక్రమ్ ప్రభుకి మంచి పేరును తెచ్చిపెట్టడంతో పాటు, మంచి వసూళ్లను కూడా రాబట్టింది.

ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో మంచు విష్ణు హీరోగా ‘డైనమైట్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే విడుదలైన స్టిల్స్ కు మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో విష్ణు లుక్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. గడ్డం బాగా పెంచేసాడు. మరి ఈ లుక్ సినిమాకు ఎలాంటి ప్లస్ అవనుందో త్వరలోనే తెలియనుంది. విష్ణు సరసన ప్రణీత హీరోయిన్ గా నటిస్తోంది.

యాక్షన్, థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను మంచు మోహన్‌బాబు సమర్పణలో, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  Dynamite  Motion Poster  Deva katta  Telugu  gallery  

Other Articles