Samantha ruth prabhu hamam soap brand ambassador

samantha news, samantha latest news, samantha hamam girl, samantha hamam soap news, samantha ruth prabhu, samantha hot gallery, samantha hot photo shoot

samantha ruth prabhu hamam soap brand ambassador : Glamour doll samantha has declared that she is doing as brand ambassador for hamam soap.

‘హమామ్ గాళ్’గా మారిన సమంతా!

Posted: 03/19/2015 10:35 AM IST
Samantha ruth prabhu hamam soap brand ambassador

గ్లామర్ డాల్ సమంత ఓవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు కొన్ని ప్రైవేట్ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ బిజీగా వుంటోంది. ఇప్పటికే ఈ అమ్మడి చేతిలో లెక్కలేనన్ని బ్రాండ్ లు వున్నాయి. వాటన్నింటికి ప్రచారకర్తగా వ్యవహరిస్తూ బాగానే డబ్బులు వెనకేసుకుంది.

ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు మరో బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం! పైగా.. ఈ విషయాన్ని ఈ అమ్మడే ట్విటర్ లో వెల్లడించింది.గతంలో ‘లక్స్’ సోప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సమంత.. ఇప్పుడు మరో సోప్ ‘హమామ్’తో ఎండార్స్ మెంట్ చేసుకుంది. ‘ఇప్పుడు నేను న్యూ హమామ్ గాళ్’ని అంటూ ఈ చిన్నది తన ట్విటర్ లో ట్వీట్ చేసింది. దీంతో స్టార్ పొజిషన్ లో వున్న ఈ అమ్మడు.. తన ఇమేజ్ ని బాగానే క్యాష్ చేసుకుంటోందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

ఇదిలావుండగా.. సమంతా నటించిన తాజా తెలుగు చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విడుదలకు సిద్ధంగా వుంది. ఈ మూవీ తప్ప తెలుగులో ఈమెకు మరే ఆఫర్లు లేవు. అయితే.. తమిళంలో మాత్రం ఈ అమ్మడి చేతిలో రెండుమూడు భారీ సినిమాలే వున్నాయి. షూటింగ్ జరుపుకుంటున్న ఆ మూవీలో ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha ruth prabhu  hamam soap  tollywood news  

Other Articles