Sridevi latest tamil flick mother movie updates boney kapoor

sridevi news, sridevi mother movie, sridevi puli movie, sridevi latest news, sridevi gossips, sridevi movie updates, sridevi mother movie updates, sridevi affairs, sridevi love affairs, sridevi controversy, sridevi daughters, sridevi husband

sridevi latest tamil flick mother movie updates boney kapoor : Sridevi has given green signal to act in mother movie as mother role which is to be produce by her husband boney kapoor and directed by ravi vadayar.

చివరికి అతిలోక సుందరి కూడా ‘మదర్’గా మారింది

Posted: 03/17/2015 11:12 AM IST
Sridevi latest tamil flick mother movie updates boney kapoor

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘అతిలోక సుందరి’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. వివాహానంతరం సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే! అయితే.. తిరిగి 20 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ మూవీ భారీ విజయం అందుకోవడంతో ఈమెకు ఎన్నో మూవీ ఆఫర్లు వచ్చాయి. అయితే.. ఈమె మాత్రం ఏదిపడితే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగాలంటే మంచి కథతో కూడిన సినిమాలు చేయడమే మంచిదని భావించిన ఈమె.. ఆ దిశగానే పావులు కదుపుతోంది.

ప్రస్తుతం శ్రీదేవి తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతున్న ‘పులి’ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది. ఇదికాకుండా తాజాగా ఈమె మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం! మనసుకు హత్తుకునే మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాకి ‘మదర్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమాలో శ్రీదేవి డాటర్ గా ఓ కొత్త హీరోయిన్ కనిపించనుంది. మొదట్లో ఈ డాటర్ పాత్రకి అక్షర హాసన్ ని పరిశీలించారు కానీ.. ఆమె పర్ ఫెక్ట్ గా సూటవుతుందా..? లేదా..? అన్నది యూనిట్ డైలామాలో పడిపోయింది. దీంతో ఆ మూవీ యూనిట్ మరికొంతమందిని పరిశీలిస్తున్నారని తెలిసింది. మరి.. శ్రీదేవి కుమార్తెగా ఎవరు చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మిగిలింది.

గతంలో పలు సక్సెస్ఫుల్ వాణిజ్య ప్రకటనలు చేసిన రవి వడయార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీదేవి భర్త, బాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. శ్రీదేవి కి ఉన్న పాపులారిటీ ని క్యాష్ చేసుకోవడం కోసం ‘మదర్’ సినిమాని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sridevi  mother tamil movie  boney kapoor  director ravi vadayar  

Other Articles