Deeksha seth got tamil movie offer director selvaraghavan hero simbu

deeksha seth news, deeksha seth movie news, deeksha seth tamil offer, deeksha seth simbu movie, selvaraghavan news, deeksha seth selvaraghavan, deeksha seth hot photos, deeksha seth latest photo shoot, deeksha seth hot gallery, deeksha seth movie gossips, deeksha seth affairs, deeksha seth love affairs, deeksha seth scandals, deeksha seth bikini photos, deeksha seth simbu romance

deeksha seth got tamil movie offer director selvaraghavan hero simbu : The Delhi Girl Deeksha seth finally got a tamil movie offer after a long time which is to be directed by selvaraghavan and simbu in leading role.

ఎంతోకాలం ‘దీక్ష’ చేస్తే.. ఇప్పుడు వరించింది!

Posted: 03/17/2015 10:05 AM IST
Deeksha seth got tamil movie offer director selvaraghavan hero simbu

మోడల్ గా కెరీర్ ప్రారంభించి ‘వేదం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి దీక్షాసేత్ అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ మూవీ తర్వాత ఈమెకు మంచి ఆఫర్లే వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్సులు వరించాయి. అయితే.. ఈమె నటించిన మూవీలు బాక్సాఫీస్ దగ్గర అంతగా సక్సెస్ కాకపోవడం వల్ల రానురాను ఈ అమ్మడికి ఆఫర్లే కరువైపోయాయి.

దీంతో అటు బాలీవుడ్ లో తన సినీకెరీర్ కి పరీక్షించుకోవడానికి వెళ్లగా.. అక్కడ కూడా మొదటి మూవీతోనే భారీదెబ్బ పడింది. ఈ దెబ్బతో అక్కడ కూడా ఆఫర్లు రాలేదు. దీంతో గతకొంతకాలం నుంచి ఈ ఢిల్లీ భామ కనిపించకుండా పోయింది. అయితే.. చాలాకాలం నిరీక్షణ చేసిన తర్వాత ఈ భామకు ఇప్పుడు ఓ మంచి ఆఫరే దక్కినట్లుగా వార్తలొస్తున్నాయి.

ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ మూవీలో తొలుత ఎవరైనా స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని భావించినప్పటికీ.. అది కుదరక చివరికి దీక్షాసేథ్ ను కథానాయికగా ఎంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇక.. చాలారోజుల అనంతరం దీక్షకు ఈ తమిళ మూవీ ఆఫర్ రావడంతో ఫుల్ హ్యాపీగా వుందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఈ మూవీతో తనకు దక్షిణాదిన మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశముందని అమ్మడు ఆశిస్తోందని అంటున్నారు. మరి.. ఈ మూవీ ఆమె కెరీర్ ని ఏ విధంగా మలుపు తిప్పుతుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deeksha seth  selvaraghavan  actor simbu  kollywood news  

Other Articles