Gopichand jil movie audio songs ghibran rashi khanna uv creations

gopichand news, jil movie news, jil movie audio songs, music director ghibran, m ghibran news, m ghibran movies, jil movie audio, jil movie audio launch, jil movie updates, jil movie release date, jil movie gallery, jil movie photos, jil audio songs, gopichand jil movie, gopichand jil news, rashi khanna, rahi khanna hot photos, uv creations

gopichand jil movie audio songs ghibran rashi khanna uv creations : Tollywood macho man gopichand latest flick jil movie audio songs got positive responce from audience which are tuned by ghiban.

స్టైలిష్ వెస్ట్రన్ పాటలతో ‘జిల్’మనిపించాడు..

Posted: 03/13/2015 11:07 AM IST
Gopichand jil movie audio songs ghibran rashi khanna uv creations

టాలీవుడ్ మాచో మేన్ గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటించిన తాజి చిత్రం ‘జిల్’. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన యువి క్రియేషన్స్ ప్రమోద్ – వంశీకృష్ణలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రాధ కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇందులో గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనువిందు చేశాడు.

ఇక ఈ మూవీ ఆడియో వేడుకను హైదరాబాద్ లో నిర్మాతలు ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి హీరో ప్రభాస్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. అతని చేతులమీదుగానే పాటలను విడుదల చేశారు. ‘రన్ రాజా రన్’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన గిబ్రాన్ ఈ మూవీకి సరికొత్త పాటలను అందించారు. స్టైలిష్ వెస్ట్రన్ తరహాలో వున్న ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. ఇబ్బడిముబ్బడిగా ఒకే తరహాలో వస్తున్న పాటలకంటే భిన్నంగా ఈ మూవీలోని పాటలు వినుసొంపుగా వున్నాయని, టైటిల్ కి తగ్గట్టుగానే ‘జిల్’మనిపిస్తున్నాయని ప్రశంసలు అందుతున్నాయి. ఈ మూవీతో ఇక గిబ్రాన్ కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ఆడియో వేడుక సందర్భంగానే ‘జిల్’ మూవీకి సంబంధించి మరో రెండు టీజర్లను విడుదల చేశారు. వాటికి మంచి స్పందన రావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం గోపీచంద్ కెరీర్ కి ప్లస్ పాయింట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. మరి.. మార్చి 27వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా గోపీచంద్ కి ఎటువంటి మలుపునిస్తుందో వేచి చూడాల్సిందే! ఈ మూవీ ఆడియో సాంగ్స్, టీజర్స్ మీకోసం....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopichand  jil movie updates  rashi khanna  uv creations  

Other Articles