Allu arjun son of satyamurthy movie release date trivikram srinivas adah sharma samantha

allu arjun news, allu arjun latest movie, son of satyamurthy movie, son of satyamurthy release date, son of satyamurthy updates, son of satyamurthy trailers, son of satyamurthy photos, adah sharma, adah sharma latest news, samantha latest news, samantha hot photos, trivikram srinivas, nitya menon news, devi sri prasad

allu arjun son of satyamurthy movie release date trivikram srinivas adah sharma samantha : Stylish star allu arjun latest flick son of satyamurthy will release on his birthday. In this movie samantha, adah sharma, nitya menon pairing with bunny and is directed by trivikram srinivas.

బర్త్ డే రోజున అల్లు అభిమానులకు స్పెషల్ గిఫ్ట్

Posted: 03/13/2015 10:38 AM IST
Allu arjun son of satyamurthy movie release date trivikram srinivas adah sharma samantha

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఇటీవలే విడుదలైన ప్రీ-లుక్ ఎక్స్ టెండెంట్, ఫస్ట్ లుక్స్, టీజర్స్ కి మంచి స్పందన వచ్చింది. వాటిలో బన్నీ సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులకు కనువిందు చేశాడు. ఇప్పుడు తాజాగా తన బర్త్ డే రోజున అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ స్టైలిష్ ఐకాన్!

ఈ చిత్రాన్ని బన్నీ జన్మదినమైన ఏప్రిల్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఓవైపు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగానే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరంగా నిర్వహిస్తున్నారు! త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా వెల్లడించనున్నారు. ఇక ఈ చిత్రం ఆడియో వేడుకను ఈనెల 15వ తేదీన హైదరాబాదులోని శిల్పకళా వేదికలో నిర్మాతలు ఘనంగా జరుపనున్నారు.

కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, రాజేంద్రప్రసాద్, సింధు తులాని కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక బన్నీ సరసన సమంతా, నిత్యామీనన్, ఆదాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles