‘ఈగ’ చిత్రంతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రెడిట్ సంపాదించి ‘అందాల రాక్షసి’ చిత్రంతో ఉత్తమాభిరుచిగల నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు వారాహి చలన చిత్రం నిర్మాణ సంస్థ అధినేత సాయికొర్రపాటి. గతేడాది నటసింహ నందమూరి బాలకృష్ణ‘లెజెండ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఆఫ్ టాలీవుడ్ తర్వాత ‘ఉహలు గుసగసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాలతో హ్యట్రిక్ విజయాలను సాధించి స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు.
తాజాగా వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి శివాని సమర్పణలో సాయికొర్రపాటి ప్రొడక్షన్‌పై రజని కొర్రపాటి నిర్మించిన చిత్రం 'తుంగభద్ర'. శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆదిత్, డింపుల్ హీరో హీరోయిన్లుగా నటించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా మార్చి 20న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటి మాట్లాడుతూ... గతేడాది బాలకృష్ణగారితో ‘లెజెండ్’ సినిమా చేశాను అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత మా బ్యానర్ లో వచ్చిన ‘ఉహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. అలాగే ఈ ఏడాది మా వారాహి చలనచిత్రం బ్యానర్ లో వస్తున్న చిత్రం ‘తుంగభద్ర’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై మంచి సక్సెస్ ను సాధించింది. హరి గౌర సంగీతానికి మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అని అన్నారు.
ఈ సినిమాతో శ్రీనివాస కృష్ణగోగినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాను బ్యూటిఫుల్ లవ్ స్టోరిగా తెరకెక్కించారు. ప్రతి సీన్ ఒక ఫీల్ ను కలిగించేలా ఉంటుంది. ఆదిత్, డింపుల్, సత్యరాజ్, కోటశ్రీనివాస రావు, చలపతి రావు తమ పాత్రలకు గొప్పగా న్యాయం చేశారు. హరిగౌర సంగీతం, రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ ప్లస్ అవుతాయి. అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమవుతుంది. సెన్సార్ సహా సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 20న గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more