Son of satyamurthy audio release on march 15

Son of Satyamurthy Audio Launch on March 15, Pawan Kalyan to Son of Satyamurthy Audio Launch, Maa Tv Bags Son of Sathyamurthy Satellite Rights, Allu Arjun news, Allu Arjun Son of Sathyamurthy movie, Son of Sathyamurthy telugu movie, Allu Arjun Son of Sathyamurthy Satellite rights, Son of Sathyamurthy telugu movie news, Son of Sathyamurthy movie Satellite rights, Allu Arjun latest updates, director satyadeva, trisha krishnan news, radhika apte news

Son of Satyamurthy Audio Release on March 15: Allu Arjun latest movie Son of Sathyamurthy. Trivikram srinivas direction, Nithya menon, adah sharma, samantha heroines. devi sri prasad music.

మార్చి 15న సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో విడుదల

Posted: 03/06/2015 11:03 AM IST
Son of satyamurthy audio release on march 15

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ఈ సినిమాలో బన్నీ సరసన నిత్యామీనన్, ఆదాశర్మ, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 8న ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. కానీ మళ్లీ ఈ ఆడియో విడుదలను వాయిదా వేసారు.

మార్చి 15న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఘనంగా జరుపనున్నారు. నిజానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజాయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అందుకే పవన్ కు డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లనే ఈ ఆడియో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లుగా సమాచారం.

ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు ప్రత్యేక అతిథులుగా రాబోతున్నారని వార్తలొస్తున్నాయి. మరి వీరిద్దరూ ఈ వేడుకకు వస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, రాజేంద్రప్రసాద్, సింధు తులాని కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu arjun  Son of Satyamurthy  Audio Launch  

Other Articles