Kajal aggarwal vishal tamil movie tollywood news

kajal aggarwal news, kajal agarwal news, kajal aggarwal hot pics, kajal aggarwal hot photo shoot, kajal aggarwal tamil movie, kajal aggarwal vishal movie, kajal aggarwal affairs, kajal aggarwal seductive photos

kajal aggarwal vishal tamil movie tollywood news : Kajal Aggarwal is ready to shift chennai for vishal's movie. She doesn't have any other movie offers in tollywood.

కాలం కలిసిరాక మకాం మార్చేస్తున్న కాజల్..

Posted: 03/05/2015 06:15 PM IST
Kajal aggarwal vishal tamil movie tollywood news

ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా చెలామణీ అయిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు ఆఫర్లు లేక సతమతమవుతోంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన ‘టెంపర్’ చిత్రం భారీ విజయాన్ని సాధించినప్పటికీ.. తెలుగులో ఒక్క ఆఫర్ కూడా ఈమె చేతిలో లేదు. పైగా.. బడాహీరోలందరూ తాజా కథానాయికలనే తమ సినిమాల్లో హీరోయిన్లుగా తీసుకొంటుండడంతో కాజల్ గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో చేసేదేమీలేక ఈ అమ్మడు తన మకాం మార్చేస్తోందని సమాచారం!

తెలుగులో ఆఫర్లు లేకపోవడంతో కాజల్ తమిళ ఇండస్ట్రీపై ఎక్కువ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఈమె విశాల్ సరసన నటించేందుకు ఓ మూవీని ఓకే చేసేసింది. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గురువారం (05-03-2015) చెన్నైలో ప్రారంభమైంది. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ కోసమే కాజల్ ఇక్కడ నుంచి చెన్నైకి పయనమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కొన్నాళ్లపాటు అక్కడే వుంటుందని తెలిసింది. మొత్తానికి ఈ అమ్మడికి కరువుకాలం స్టార్ట్ అయిందన్నమాట!

ఇంకో విషయం ఏమిటంటే.. తమిళంలోనూ ఆమె విశాల్ మూవీలో మాత్రమే నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో ఓ రొమాంటిక్ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు మూవీల తర్వాత అమ్మడి చేతిలో మరే ఆఫర్లు లేవు. తెలుగులో యంగ్ హీరోయిన్ల హవా ఎక్కువగా కొనసాగుతోంది కాబట్టి.. ఈమెకు భవిష్యత్తులో ఆఫర్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు! ఇటువంటి పరిస్థితుల్లో కాజల్ తన కెరీర్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal aggarwal news  vishal latest tamil movie  tollywood gossips  

Other Articles