Manchu manoj attack movie shooting updates

Manchu Manoj Attack movie shooting updates, RGV Attack movie shooting updates, RGV Attack movie shooting, Attack movie news, Manchu manoj Attack movie, Attack movie updates, Attack movie stills, Manchu manoj latest stills, Attack movie shooting in puranapool, Attack movie posters

Manchu Manoj Attack movie shooting updates: Ramgopal varma upcoming movie Attack. Manoj, surabhi act in lead roles and Jagapati babu, prakash raj act in important roles.

మనోజ్ పై 1000 మందితో వర్మ ఎటాక్

Posted: 02/26/2015 10:25 AM IST
Manchu manoj attack movie shooting updates

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ …  ఆయన కత్తికి రెండు వైపులా పదునే. ఆయన అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు తీయగలరు. లో బడ్జెట్ సినిమాలూ కూడా తీయగలరు. “అతివృష్టి అనావృష్టి” లాగ అన్నమాట!!

ఇటీవలకాలంలో చిన్న సినిమాలు అత్యంత ప్రయోగాత్మకంగా తీస్తూ వస్తున్న ఆయన ఈ పద్ధతికి స్వస్తి పలికి, ఇప్పుడు మళ్ళీ తనదైన ట్రెండ్ సెట్టింగ్ స్టైల్ లోకి వచ్చేశారు. “ఎటాక్” అనే వర్కింగ్ టైటిల్ తో… హై ఇంటెన్సిటి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న తన తాజా చిత్రంలోని ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం తెలుగు చలన చరిత్రలో ఇంతవరకూ ఎవరూ షూట్ చెయ్యని విధంగా.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ పురానాపూల్ బ్రిడ్జ్ మీద దాదాపు 1000 మంది పాల్గొనే యాక్షన్ ఎపిసోడ్ ను రెయిన్ ఎఫెక్ట్ లో తియ్యబోతున్నారు.

ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ఫిబ్రవరి 27 ఉదయం నుంచి జరగబోతోంది. హైదరాబాద్ ధూల్ పేట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ చిత్రంలోని కొంత మంది నటీనటుల లుక్స్ ని రిలీజ్ చేశారు రాంగోపాల్ వర్మ. మంచు మనోజ్, సురభి హీరోహీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. సి.కళ్యాణ్ నిర్మాణంలో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం జూన్ లో విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Attack  movie  Rgv  Manchu  Manoj  shooting  telugu  news  

Other Articles