Ram charan srinuvaitla movie launch date

Ram Charan Srinuvaitla Movie Launch Date, Ram Charan Movie Launch on march 5th, Rakul Preet Singh in Ram charan movie, Ram charan latest movie news, rakul preet singh, rakul preet singh hot photos, ram charan latest news, director srinu vaitla news, ram charan srinu vaitla news, my name is raju movie, my name is raju movie updates, tollywood gossips, cherry new movie project

Ram Charan Srinuvaitla Movie Launch Date: Ram charan upcoming movie My name is raju in srinuvaitla direction. dvv danayya producer, rakul preet sing heroine. anirudh music.

రాంచరణ్ కొత్త సినిమా తేది, హీరోయిన్ ఫిక్స్

Posted: 02/16/2015 10:31 AM IST
Ram charan srinuvaitla movie launch date

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ‘మై నేమ్ ఈజ్ రాజు’(వర్కింగ్ టైటిల్). ప్రముఖ రచయితలు కోనవెంకట్, గోపి మోహన్ లు కలిసి కథ, మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో చరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. ప్రముఖ తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 5న ప్రారంభించనున్నారు.

ఈ సినిమా గురించి నిర్మాత దానయ్య మాట్లాడుతూ... హిట్ చిత్రాల కాంబినేషన్ శ్రీనువైట్ల, కోనవెంకట్, గోపిమోహన్ ల కలయికలో రాబోతుంది. కోన వెంకట్, గోపిమోహన్ లు కథను అందిస్తున్నారు. చరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోందని చెప్పుకొచ్చారు.

ఈ సినిమా మార్చి 5న లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. అలాగే మార్చి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి, అక్టోబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మార్చి 5న తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Srinu vaitla  Rakul preet singh  Anirudh  Telugu movies  News  Tollywood  

Other Articles