Celebs mourn ms narayana death

MS Narayana, MS Narayana movies, MS Narayana death news, MS Narayana death, MS Narayana latest news, MS Narayana comedian, comedian MS Narayana news, comedian MS Narayana passed away, MS Narayana passed, tollywood comedian MS Narayana dead, ms narayana family members, ms narayana filmography, ms narayana life story, celebrities condolence, chandrababu condolence, KCR condolence, chiranjeevi condolence, tollywood condolence, muralimohan condolence, kondavalasa condolence

Tollywood mourns as comedian MS Narayana passed away

నవ్వులరేడు నారాయణకు ప్రముఖుల సంతాపం.. రేపు అంత్యక్రియలు

Posted: 01/23/2015 04:02 PM IST
Celebs mourn ms narayana death

నవ్వుల రేడుగా తెలుగు చిత్ర వెండితెరపై వెలుగొందిన ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ అకస్మాత్తుగా మృతి చెందడంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినిమా సినిమాకి తన క్యారెక్టర్ లో విభిన్న వైవిద్యాలను ప్రదర్శించి తెలుగు ప్రజలను ఔరా అనిపించేలా నవ్వించిన ఎంఎస్ మరణవార్తతో తెలుగు సినిమా పరిశ్రమతో పాటు అభిమాన లోకం కూడా శోకసంధ్రంలో మునిగింది. తన నటనాకౌశల్యంతో విమర్శకులను సైతం మొప్పించిన కమేడియన్ గా ఎమ్మెస్ గుర్తింపును తెచ్చుకున్నారు.

ఎంఎస్ నారాయణ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే.చంద్రశేఖర్ రావులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎంఎస్ నారాయణ మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని చంద్రబాబు అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ మంచి హాస్యనటుడిని కోల్పయిందని కేసీఆర్ అన్నారు. ఎంఎస్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రనటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా ఎంఎస్ నారాయణ మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎంఎస్ ఆకస్మిక మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా పేర్కోన్నారు. ఎంఎస్ ఉన్నారంటే చాలు.. చిత్రాలకు మినిమమ్ గ్యారంటీ అని తెలుగు ప్రేక్షకులు అధరిస్తుని.. అంతలా అయన హాస్యానికి అలవాటు పడిన తరుణంలో మరణించడం తెలుగు ప్రేక్షక లోకంతో పాటు ఇండస్ట్రీని కూడా లోటుగా చిరంజీవి అన్నారు.

ఎంఎస్ మరణవార్త తెలుగు చిత్రపరిశ్రమకు షాకింగ్ న్యూస్ అని సినీనటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. ఎమ్మెస్ నారాయణ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారన్నారు. సినిమా, సినిమాకు ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉండేవన్నారు. నిన్న ఆయన మృతిపై వదంతులు వచ్చాయని, దాంతో వెంటనే ఎంఎస్ కుమార్తె శశికిరణ్తో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. అంతలోనే ఇలా జరగడం బాధకరమన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏదో పట్టుకుందని, 23 రోజుల్లో ఇది నాలుగో చావు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంఎస్ నారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని మురళీమోహన్ పేర్కొన్నారు.

ఎంఎస్ నారాయణ ఎంత గొప్ప నటుడో, అంత ఆత్మీయుడని హాస్యనటుడు కొండవలస అన్నారు. ఆయన స్వర్గస్తులయ్యారంటే మనసు చలించిపోతోందన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతుంటే ఎంఎస్ ఆదరించి, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారన్నారు. విభిన్న పాత్రలు చేసిన ఎంఎస్...సెట్లో ఉన్నప్పుడు తోటి నటులకు సలహాలు ఇచ్చేవారని, అనవసరపు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వొద్దు... అవసరం ఉన్నంతవరకూ నటించాలని అనేవారని కొండవలస తెలిపారు. క్రమశిక్షణ లేనిదే సినిమా రంగంలో రాణించలేరని, డిసిప్లెస్ వల్లే ఎంఎస్ ఈ స్థాయికి ఎదగగలిగారన్నారు. ఎంఎస్ నారాయణ మృతి తనకు, తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటు అని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొండవలస అన్నారు. ఎంఎస్ కుటుంబసభ్యులకు కొండవలస ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంఎస్ నారాయణ గురించి మాట్లాడేందుకు తనకు మాటలు రావటం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.

ఎమ్మెస్ హఠాన్మరణం పట్ల తాను తీవ్ర దిగ్ర్బాంతి గురయ్యానని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. ఎమ్మెస్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పేర్కొన్నాడు. మరో దర్శకుడు రాజమౌళి కూడా ఎమ్మెస్ నారాయణ మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎంఎస్ ను మిస్పవుతున్నామని ఆయన తన సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. మరో హాస్య నటుడు అలీ ఎంఎస్ మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశాడు. ఎంఎస్ తనకు ఒక గురువుగా ఎన్నో విసయాలు చేప్పేవాడని, ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు.

ఎమ్మెస్ నారాయణ అనారోగ్యంతో కన్నమూయడం పట్ల నటి మంచు లక్ష్మీ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించింది. ఎంఎస్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, ఆయనను నటుడిగా తన తండ్రి మోహన్ బాబే ప్రోత్సహించారని గుర్తుకు తెచ్చుకుంది. అద్భుతమైన కెరీర్ సోంతం చేసుకున్నారని పేర్కొంది. ఎంఎస్ కూతురు శశి నారాయణ పట్ల గర్వంతో పోంగిపోయారని.. అమె దర్శకత్వంలో రాణిస్తుందని చివరిసారిగా మాట్లాడినప్పడు ఆయన ఆభిలాషించారని మంచు లక్ష్మీ పేర్కొంది.

రేపు వికారాబాద్ లో అంత్యక్రియలు

ఎం.ఎస్ పార్థీవదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4గంటల వకు ఫిలింఛాంబర్‌లో ఉంచనున్నారు. రేపు వికారాబాద్‌లోని వ్యవసాయక్షేత్రంలో ఎం.ఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  MS Narayana  condolence  

Other Articles