Girl wants to marry hero nithin

Nithin marriage, Nithin movies, Girl wants marry nithin, Nithiin, hero Nithin latest photos, nithin wallpapers, Hero nithin marriage, Nithin house, Nithin upcoming movies, tollywood updates, Jublee Hills police

Girl Wishes to marry Hero Nitihn : A girl Entered into hero Nithin house on thursday night. friday morning Nithin Mother saw girl in her house compound and enquired about her. Nithin mother complained about girl, police given counselling to her and sent to home

నితిన్ తో పెళ్లికి చిన్నది రెడి

Posted: 01/17/2015 08:42 AM IST
Girl wants to marry hero nithin

వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా.., నితిన్ పెళ్లి కోసం కుటుంబ సభ్యులు అమ్మాయిని వెతుకుతుండగా.., ఓ అమ్మయే హీరోను పెళ్ళి చేసుకుంటానని వచ్చింది. ధైర్యం చేసి ఇంట్లోకి కూడా ప్రవేశించింది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను పోలిసులకు అప్పగించారు. ఈ విషయంపై పూర్తి డిటేల్స్ చూస్తే.. జూబ్లీహిల్స్ లోని నితిన్ ఇంట్లోకి సెక్యురిటీ గార్డుల కళ్ళుగప్పి గురువారం రాత్రి ఓ అమ్మాయి ప్రవేశించింది. రాత్రంతా వరండాలో పడుకుంది.

తెల్లవారుజామున నిద్ర లేచిన నితిన్ తల్లి యువతిని గమనించి, నిద్ర లేపింది. ఎవరని ప్రశ్నించటంతో.., ‘నేను నితిన్ అభిమానిని ఆయన కోసమే ఇక్కడకు వచ్చాను, ఆయన్ను పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పింది. దీంతో నితిన్ తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా.., జూబ్లీ హిల్స్ పోలిసులు ఇంటికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా.., తాను ఓ పోలిస్ ఆఫీసర్ కూతురును అని చెప్పింది. ‘నితిన్ ను ప్రేమిస్తున్నాను, ఆయన లేకపోతే జీవించలేను’అని పోలిసులతో కూడా చెప్పింది.

యువతిని స్టేషన్ కు తరలించిన పోలిసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే బాగుండదు అని హెచ్చరించి ఇంటికి పంపించేశారు. అటు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. నితిన్ నిద్ర లేవక ముందే ఈ మొత్తం తతంగం ముగియటంతో.., ఆమె ఎవరనేది హీరోకు తెలియలేదు. గతంలో కూడా కొందరు హీరోయిన్లను, హీరోలను పెళ్లి చేసుకుంటామని, ప్రేమిస్తున్నామని అభిమానులు వెంటపడిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin marriage  Jublee hills police  tollywood updates  

Other Articles