Gopala gopala beat i movie collection in tollywood

I movie review, I movie public talk, Shankar I movie updates, Shankar I movie review and rating, I movie telugu review and rating, Gopala Gopala movie collections, Gopala Gopala updates, Pawan Kalyan latest, tollywood updates, Upcoming telugu movies

Gopala Gopala I movie collectios in tollywood : Shankar I movie created huge expectations but not reached target so that Gopala Gopala only lead tollywood till next month. no other movies releasing in January so that Gopala Gopala will lead success

సంక్రాంతి సంబరమంతా గోపాలుడిదే

Posted: 01/14/2015 04:02 PM IST
Gopala gopala beat i movie collection in tollywood

తిమింగలం వస్తుంటే ఎన్నో చిన్న చేపలు భయపడి పక్కకు తప్పుకున్నాయి. కాని ఒక చేప మాత్రం తన దారి తనది, తిమింగలం వస్తే ఏం అనుకుంది. ఆ చేపను చూసి అంతా బలుపు అనుకున్నారు. కాని తనపై ఉన్న నమ్మకం అని ఎవరూ పసిగట్టలేకపోయారు. చివరకు వేటాడేందుకు వచ్చిన తిమింగళం కూడా ఏమి చేయలేక ముడుచుకుని వెళ్ళిపోయింది. ఈ కథ తో మీకు విషయమేంటో అర్థం అయి ఉంటుంది. ఇదంతా ‘గోపాల గోపాల’ ‘ఐ(మనోహరుడు)’ సినిమాల గురించి. శంకర్ సినిమా వస్తే పవన్ కళ్యాణ్ మూవీ కన్పించకుండా పోతుంది అని చాలామంది ఊహించారు. కానీ సీన్ చూస్తే ‘ఐ’ భవిశ్యత్తే అగమ్యగోచరంగా మారిందని స్పష్టం అవుతుంది.

సంక్రాంతి రేసులో ఉన్న చాలా సినిమాలు అనేక కారణాలతో పోటి నుంచి తప్పుకోగా కేవలం ‘గోపాల గోపాల’ మాత్రమే విడుదల అయింది. ‘ఐ’ వస్తుందని తెలిసినా... కథపై ఉన్న నమ్మకం, ప్రేక్షకులు ఆదరిస్తారన్న విశ్వాసంతో సినిమా విడుదల అయింది. అంతా ఊహించినట్లుగానే తొలి మూడు రోజులు సినిమా బాగా ఆడింది. అయితే ‘ఐ’ ఫీవర్ తో 4వ రోజు కలెక్షన్లు కాస్త తగ్గాయి. దీంతో మేం చెప్పిందే నిజమవుతుంది అని కొందరు సినీ అనలిస్టులు జోస్యం మొదలు పెట్టారు. భారీ అంచనాల మద్య విడుదల అయిన ‘ఐ’ ఆశలను ఆవిరి చేసింది. ఊరించి ఉస్సూరుమన్పించినట్లుగా సినిమాకు సీన్ లేకపోవటంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

సినిమా బాలేదని టాక్ వచ్చినా.., పండగ సీజన్ కావటంతో ఈ నాలుగు రోజుల పాటు బాగానే ఆడుతుంది. కానీ ఆ తర్వాత మళ్లీ గోపాలుడి హవా కొనసాగుతుందని స్పష్టం అవుతోంది. దీనికి తోడు ఈ నెలలో పెద్ద సినిమాలేవి విడుదల అవుతున్నట్లు ప్రకటించలేదు. దీంతో నెలంతా ‘గోపాల గోపాల’ సోలోగా దూసుకెళ్తందన్నమాట. ‘ఐ’విడుదల కారణంగా చాలా థియేటర్లలో తొలగించిన ‘గోపాల గోపాల’ను తిరిగి ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్లు మళ్ళీ ఒప్పందాలు కూడా మొదలు పెట్టేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : I movie  Gopala Gopala  Pawan Kalyan latest  

Other Articles