Etv prabhakar with geetha arts

Etv Prabhakar movie, Etv Prabhakar geeta arts movie, Gita arts banner movies, Prabhakar Gita Arts movie name, Etv Prabhakar latest, Etv Prabhakar updates, tollywood latest, latest telugu updates, upcoming telugu movies

Etv Prabhakar with Geetha Arts : actor turned dubbing artist Etv Prabhakar soon going to direct a movie in Geeta Arts Banner. Prabhakar comes work comes to end for his debut movie as director.

ప్రభాకర్ కూడా పెద్దవాడయ్యాడు

Posted: 01/08/2015 11:55 AM IST
Etv prabhakar with geetha arts

డబ్బింగ్ ఆర్టిస్టుగా జీవితం మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగిన ప్రభాకర్ ఇప్పుడు సినిమాలు తీసే స్థాయికి చేరుకన్నాడు. అదికూడా ఆషామాషీ బ్యానర్ లో కాదు. తొలి సినిమానే ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తీస్తున్నాడట. కొద్దికాలంగా సైలెంట్ గా ఉన్న ప్రభాకర్ కు ఈ బంపర్ ఆఫర్ ఎలా తగిలిందా అని సినీ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జీ లో సీరియల్ డైరెక్ట్ చేసిన ఈ నటుడు అప్పట్లోనే సినిమా కథను సిద్ధం చేసుకున్నాడట. స్క్రిప్టు రాసుకుని అల్లు అరవింద్ గారిని కలిసి చెప్పాడట. కథ నచ్చటంతో సినిమా చేద్దామని అరవింద్ మాట ఇచ్చాడట.

ఇదంతా చాలా కాలం క్రితమే జరిగినా.., స్క్రిప్టు తుది దశ పనులు దగ్గరపడటంతో విషయం బయటకు వచ్చింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం. వచ్చే నెలలోనే ఈ ప్రాజెక్టు షూటింగ్ మొదలవుతుందని చెప్తున్నారు. అయితే హీరో, హీరోయిన్లపై మాత్రం సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. షూటింగ్ మొదలు పెడితే ఈ వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రభాకర్ సినిమా చేస్తున్నాడని తెలిసి ఇండస్ర్టీ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈయన కూడా పెద్దవాడు అయ్యాడు అని చెప్తున్నారు.

డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన ప్రభాకర్.., సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈటీవీలో చాలా సీరియల్స్ లో కన్పించి ఈటీవీ ప్రభాకర్ గా పేరు పొందాడు. యాహూ, స్మైల్ రాజా స్మైల్ వంటి షోలు చేసి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈటీవీ నుంచి బయటకు వచ్చి జీ తెలుగులో కెరీర్ కొనసాగించాడు. ‘ముద్దుబిడ్డ’ అనే సీరియల్ డైరెక్ట్ చేశాడు. దీనికి మంచి పేరు వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Etv Prabhakar  Geetha Arts  tollywood updates  

Other Articles