Tamils protest against salman khan in mumbai

tamils protest against salman khan, tamils protest in mumbai, tamils protest in front of salman khan house, tamils protest against salman khan, salman khan campaigned for mahindra rajakapse, salman khan latest news, salman khan latest updates, salman khan latest movies, salman khan latest photos, salman khan latest songs, bollywood news

Tamilians protest in front of salman khan in mumbai for campaigning to mahindra rajakapse for presidential elections

పొరుగింటి పుల్ల కూర కోసం పరుగులా..?

Posted: 01/04/2015 09:44 PM IST
Tamils protest against salman khan in mumbai

బాలీవుడ్ కండల వీరుడు హీరో సల్మాన్ ఖాన్ కు తమిళుల సెగ తగిలింది. ముంబాయిలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న తమిళులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. తెల్లవారు జామునే సల్మాన్ ఖాన్ నివాసానికి చేరుకున్న తమిళులు.. ఆయన నివాసానికి ఎదురుగానే ఆందోళనను నిర్వహించారు. సువిశాలమైన భారత దేశంలో ఎన్నో రాష్ట్రాలు వున్నాయి.. అక్కడ ఎవరికైనా మద్దతునిస్తే తాము వద్దనబోమన్నారు. తమ మనోభావాలకు విరుద్దంగా వ్యవహరించిన సల్మాన్ ఖాన్ శ్రీలంకకు చేరుకుని అక్కడి అధ్యక్షుడు మహేంద్ర రాజపక్షేకు మద్దతునివ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్తున్నామన్నారు.

శ్రీలంకలో తమిళులను అతి దారుణంగా హింసించి వధించిన ఆ దేశ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్షేకు సల్మాన్ ఖాన్ మద్దతు ఎలా ప్రకటిస్తారని వారు ప్రశ్నించారు. శ్రీలంక దాష్టికాలపై ఐక్యరాజ్యసమితిలో కూడా భారత్ ఆ దేశానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కాగా పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ ఇంటి వద్ద భద్రతను మరింత పెంచినట్టు బాంద్రా పోలీసులు తెలిపారు. సల్మన్ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు. అయినా.. మన దేశంలో జరిగే ఎన్నికలలో నిమ్మకుండిన సల్మాన్ శ్రీలంకలో ఎన్నికలంటే ఎందుకు ప్రచారం చేసినట్లు..? పోరుగింటి పుల్ల కూరా కోసం ఎందుకు పరుగులు తీస్తున్నట్లు అంటూ బాలావుడ్ వర్గాలు కూడా గుసగుసలాడుతున్నాయి.

జి.మనోమర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  salman khan  Tamilians  protest  

Other Articles