Court orders to auction of asin house

Asin house problems, Asin house auction, Asin house in Ravipuram, Asin house in kerala, Asin movies, Asin upcoming movies, tollywood updates, upcoming movies in tollywood, home decorators, good home decorators in hyderabad, Ernakulam district court

Court orders to auction of Asin house : Ernakulam court orders to attach heroine Asin house in ravipuram near kochi. court gives auction orders to auction Asin house near kochi if she not paid balance amount to jayalaxmi. Actress Asin have no chances in recent days, she struggling for movies and facing problems from out side of industry

అమ్మకానికి అసిన్ స్వప్నలోకం

Posted: 01/03/2015 11:29 AM IST
Court orders to auction of asin house

కొద్ది కాలం క్రితం టాలీవుడ్ ను ఏలిన అమ్మడికి ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. బాలీవుడ్ పిలుస్తోందని, తెలుగు, తమిళ సినిమాలను వదిలేసుకుని వెళ్లింది. బి టౌన్ లో ఓ రెండు మూడు సినిమాలు ఆడాయి. ఆ తర్వాత ముంబై భామల ధాటికి తట్టుకోలేక కేరళ కుట్టి కుదేలయింది. వెక్కిరించిన వారు అవకాశాలు ఇవ్వకపోవటంతో ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి. ఎంతలా అంటే చివరకు బాకీలు కూడా కట్టలేనంత స్థాయికి ఆసిన్ ను దిగజార్చాయి. డబ్బు కట్టకుంటే.., ఇంటిని వేళం వేయక తప్పదని కోర్టు హెచ్చరించే దుస్థితి వచ్చింది.

బాగా సినిమాలు చేసిన సమయంలో అందరు హీరోయిన్ల లాగానే అసిన్ కూడా ఆస్తులు కూడబెట్టుకుంది. కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న రవిపురంలో ఈ హీరోయిన్ కు ఓ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ఉంది. తన టేస్ట్, ట్రెండ్ కు తగ్గట్టు స్వప్న లోకం మాదిరిగా ఇంటిని డెకరేట్ చేసేందుకు జయలక్ష్మి అనే డిజైనర్ కు పని అప్పగించింది. అసిన్ పై నమ్మకంతో పది లక్షల రూపాయలతో ఇంటిని డిజైన్ చేసి బిల్లు పెట్టింది. అయితే అప్పటికి పరిస్థితులు మారిపోయాయి.., వస్తాయి అనుకున్న సినిమాలు రాలేదు. పిలుస్తారు అనుకున్న ప్రొడ్యూసర్లు పక్కనబెట్టేయటంతో ఏమి చేయలేకపోయింది.

సినిమాలు లేక ఇంటికి పరిమితమైన అసిన్.. కొత్త ఇంటికి డబ్బులెక్కడినుంచి కట్టాలో తెలియక ఏదో ఒక వంక చెప్తూ చెల్లింపులు దాటవేసింది. చివరకు జయలక్ష్మి ఓపిక నశించి కోర్టుకెక్కటంతో, కథ అడ్డం తిరిగింది. ఈ నెల 14లోపు డబ్బులు చెల్లిస్తే సరి లేదంటే ఇల్లు వేలానికి పెడతామంటూ ఎర్నాకులం జిల్లా కోర్టు స్పష్టం చేసింది. సినిమాలు లేక చితికిపోయిన ఈ కేరళ కుట్టి డబ్బులు కడుతుందా లేక కలల ఇంటిని వదిలేసుకుంటుందా అనేది సస్పెన్స్ గా మారింది.

కార్తిక్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asin house  Ernakulam court  Tollywood Updates  

Other Articles