Chiranjeevi fulfills last wish of cancer afflicted boy

chiranjeevi fulfills last wish, mega star chiranjeevi, former union minister chiranjeevi, chiru fulfills last wish, chiru fulfills cancer afflicted boy last wish, chiranjeevi fulfills cancer afflicted boy last wish, chiru chiru meets adilabad cancer afflicted boy balu, chiranjeevi visits MNJ hospital, chiru spends time with cancer afflicted balu, chiru into tears as balu wept, chiru enjoyed balu dialogues, chiru gives balu acting oppurtunity, chiru invites balu and family, chiru invites balu visit his house

mega star and former union minister chiranjeevi cisited MNJ hospital and spent time with a cancer afflicted 10 year old balu

మానవత్వం పరిమళించిన శుభవేళ.. చిన్నారికి చిరంజీవీ పరామర్శ

Posted: 12/25/2014 05:26 PM IST
Chiranjeevi fulfills last wish of cancer afflicted boy

మానవత్వం పరిమళించింది. పదేళ్ల అభిమాని కోసం పరుగులు తీసింది. చిన్నారితో కొంత సమయాన్ని గడపి వద్దామనుకునే లోపు కన్నీళ్లను పెట్టించింది. చిన్నారి నోటి వెంట జాలువారిని పలు చిత్రాలలో డైలాగులు మనస్పూర్తిగా గుండెకు హత్తుకునేలా చేసింది. ఆరోగ్యం బాగైన తరువాత వారిని తన ఇంటికి రమ్మని ప్రత్యేకంగా ఆహ్వానాన్ని అందించింది. అంతేకాదు.. ఎవర్వూ ఊహించని విధంగా తన చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించింది. ఇదంతా కల్మషం తెలియని, ఓ అభిమాని కోసం మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రక్రియే.

మెగా వారింట అభిమానులకు ఓ ప్రత్యక స్థానం వుందని చాటిచెప్పేలా చేసే పలు ఘటనలు మనం చూశాం. అయితే అభిమానుల కోసం స్వయంగా తామే కదిలివెళ్లే చర్యలకు కూడా మెగాఫ్యామిలీయే శ్రీకారం చుట్టింది. సినీ నటుడిగానే కాకుండా  కేంద్ర మాజీమంత్రి హోదాలో నిత్యం బిజీబిజీ షెడ్యూల్ మధ్య గడిపే చిరంజీవి పవిత్ర పర్వదినం క్రిస్మస్ దినాన ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రిని సందర్శించారు. క్యాన్సర్తో బాధపడుతున్న బాలు అనే చిన్నారితో ముచ్చటించారు. ఆదిలాబాద్ కు చెందిన పదేళ్ల బాలు గత ఏడాదిగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. అతని ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు భరోసా ఇచ్చినా... బాలు మాత్రం ఈమధ్య కాలంలో దిగులుగా కనిపించాడు. ఏంటా అని వైద్యులు ఆరా తీస్తే...తన అభిమాన నటుడు చిరంజీవిని చూడాలని ఉందంటూ మనసులోని కోరికను బయటపెట్టాడు.

ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న చిరంజీవి ...ఇవాళ ఎంఎన్జే ఆస్పత్రికి వెళ్లి బాలును కలిశారు. అంతేకాకుండా అతని కోసం ఖరీదైన బోలెడు బహుమతులు తీసుకు వెళ్లారు. బాలు దగ్గర కూర్చొని చిరంజీవి కబుర్లు చెప్పారు. అలాగే ఇంద్ర సినిమాలోని...'మొక్కేకదా అని పీకేస్తే...పీక కోస్తా అంటూ బాలు చెప్పిన డైలాగ్ను మరోసారి అడిగి చెప్పించుకున్నారు. తనతో కలిసి డాన్స్ చేయాలని ఉందన్న బాలు కోరికను తీర్చుతానని చిరంజీవి హామీ ఇచ్చారు. తన 150వ సినిమాలో బాలు నటించే అవకాశం ఇస్తానని ఆయన చెప్పారు. తన కుమారుడి కోరిక మన్నించి చూసేందుకు వచ్చిన చిరంజీవికి ఈ సందర్భంగా బాలు తల్లిదండ్రులు  కృతజ్ఞతలు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  MNJ Hospital  canced afflicted boy  last wish  Balu  

Other Articles