Junior ntr sukumar movie shooting starts soon

junior ntr movie, ntr sukumar movie shooting updates, ntr sukumar movie heroine, temper movie release problems, temper movie release date, temper movie latest updates, tollywood latest news updates

junior ntr sukumar movie shooting starts soon : junior ntr busy with temper movie shooting and latest news that nandamuri hero all set to start shooting for sukumar movie, sukumar ntr movie shooting starts soon

నవ్వాలా.. ఏడవాలా తెలియటం లేదు !

Posted: 12/11/2014 12:28 PM IST
Junior ntr sukumar movie shooting starts soon

ఎన్టీఆర్ ఇప్పుడో విచిత్రమైన స్టేజిలో ఉన్నాడు. తను ఉన్న పరిస్థితి చూసి నవ్వాలో.., లేక ఎందుకిలా జరగుతోందని ఏడవాలో తెలియక తికమకపడుతున్నాడట. నవ్వటానికి కారణం చూస్తే.., త్వరలోనే తారక్ మరో సినిమా చేయబోతున్నాడట. సుకుమార్ డైరెక్షన్ లో గతంలోనే ఓకే అయిన ప్రాజెక్టు షూటింగ్  ఈ నెలలోనే మొదలు పెడతారని అంటున్నారు. ప్రస్తుతం స్ర్కిప్టును ఎన్టీఆర్ కు తగ్గట్లు మెరుగులు దిద్దుతున్న సుకుమార్.., త్వరలోనే మెగా ఫోన్ పట్టుకుని సెట్ లోకి వస్తారని ఫిలింనగర్ టాక్. సినిమా పూర్తి చేసి వెంటనే మరో సినిమా అంటే హీరోకే కాదు ఫ్యాన్స్ కు కూడా పండగే.

ఇదే సమయంలో హీరోను ఓ విషయం బాధపెడుతోంది. సంక్రాంతి టార్గెట్ గా సిద్దమవుతున్న ‘టెంపర్’ మూవీ అనుకున్న సమయానికి రావటం లేదని గుసగుసలు విన్పిస్తున్నాయి. టార్గెట్ రీచ్ కావటం కోసం షూటింగ్ సమయంలోనే పోస్ట్ ఫ్రొడక్షన్ పనులు కూడా వేగంగా చేసుకుటూ వస్తున్నారు. అయినా సరే సినిమా విడుదల కాకపోవచ్చు అని ఫిలింనగర్ టాక్. దీంతో తారక్ చాలా డిప్రెస్ అవుతున్నాడని తెలుస్తోంది. చాలా కష్టపడి.., భారీ అంచనాలతో సినిమా తీస్తే అనుకోని పరిస్థితులు ఇలా చేయటంతో బాధపడుతున్నాడట.

సుకుమార్ తో చేసే సినిమా విషయానికి వస్తే.., భోగవల్లి ప్రసాద్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. హీరోయిన్ తదితర అంశాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. ఆ మద్య మహేష్ తో ‘1 నేనొక్కడినే’ సినిమా తీసినా అది ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు. దీంతో కథ ఎంపికతో పాటు.., సినిమా చూపించే విధానంలో కూడా మార్పులు తీసుకొస్తున్నట్లు సన్నిహితులు అంటున్నారు. ఈ మూవీ గురించి త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ అందిస్తాము.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sukumar ntr movie  temper release date  ntr movie updates  

Other Articles