వ్యభిచారం కేసులో అరెస్టయి.., బెయిల్ పై బయటకు వచ్చిన శ్వేత బసు ప్రసాద్.., రెండ్రోజుల క్రితమే నిర్దోషిగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రెచ్చిపోయి ప్రవర్తిస్తోంది. గతంలోనే తానేతప్పూ చేయలేదనీ.., ఓ వర్గం మీడియాపై ఆరోపించిన కొత్త బంగారు లోకం స్వప్న తాజాగా విమర్శలకు పదును పెట్టింది. వ్యభిచార కేసులో పోలిసులు నన్ను అరెస్టు చేశారు. నాతో పాటు గదిలో కొందరు వ్యాపారవేత్తలు ఉన్నారని ఆరోపించారు. వారెవరో నిరూపించగలరా అని పోలీసులకు సవాల్ విసిరింది.
తనతో పాటు వ్యభిచారం కేసులో వ్యక్తులు దొరికితే వారెవరో బయటకు చెప్పాలని ప్రశ్నిస్తోంది. పోలిసుల లాగానే.., తాను కూడా ఎవరో దొరికారనే విషయాన్ని తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ నిజంగా అరెస్టు సమయంలో ఎవరైనా దొరికి ఉంటే వారి పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేస్తోంది. తనతో పాటు దొరికిన వారి పేర్లు బయటకు ఎందుకు రాలేదో ఆలోచించాలి అని సూచిస్తోంది.
తన అరెస్టుకు ముందు.., తర్వాత జరిగిన పరిణామాలను వివరించింది. ‘సంతోషం అవార్డుల కార్యక్రమం కోసం హైదరాబాద్ కు వచ్చాను. ఆ సమయంలో ముందుగా బుక్ చేసిన హోటల్ లో ఉండగా, పోలిసులు వచ్చి వ్యభిచారం కేసులో అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కోర్టు, రెస్క్యూ హోం, బెయల్ ఇదంతా జరిగాయి. కాని ఈ సమయంలో ఓ వర్గం మీడియా కూడా తప్పుడు ప్రకటనలతో ఇబ్బంది పెట్టింది.’ అని శ్వేత ఆరోపించింది. ‘ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలోనే వ్యభిచారం చేయాల్సి వచ్చింది. అని నా పేరుతో ఎవరో మీడియాలో తప్పుడు ప్రకటనలు’ చేశారని మండిపడింది.
గతంలో తనపై జాలి చూపిన వారే.., నిజాలు దాస్తున్నట్లు భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు నిజాలను దాచాల్సిన అవసరం లేదని శ్వేత బసు స్పష్టం చేసింది. అసలు సమస్య అంతా సమాజంలోనే ఉందనీ... ప్రజల ఆలోచనా విధానం మారితే అంతా బాగుంటుందని శ్వేత బసు తెలిపింది. సెప్టెంబర్ లో అరెస్టయిన శ్వేతకు గత నెలలో కోర్టు బెయిల్ ఇచ్చింది. శ్వేతపై వచ్చిన ఆరోపణలను నాంపల్లి కోర్టు రెండ్రోజుల క్రితం కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం సినిమా ఆఫర్లపై దృష్టి పెట్టని శ్వేత బసు ఫాంటమ్ ప్రొడక్షన్స్ లో స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పనిచేస్తోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more