Varun tej mukunda set to release in december end on the eve of christmas

varun tej, mukunda, set to release, december end, december last week, on the eve of christmas, chirstmas, christmas movies, december movies, film news, movie news, new movies, telugu movies

varun tej mukunda set to release in december end on the eve of christmas

బాబాయ్ తో పోటీనా.. నేనా అంటున్న ముకుంద

Posted: 11/23/2014 12:52 PM IST
Varun tej mukunda set to release in december end on the eve of christmas

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ముకుంద’. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తే.. పండగ సీజన్ కాబట్టి మంచి కలెక్షన్ వస్తాయని భావించారు. అసలే సంక్రాంత్రి సెంటిమెంట్ మన సినిమాలకు బాగా కలిసోస్తుందని అందుకే అప్పుడే విడుదల చేద్దామని భావించారు. కానీ సంక్రాంతికి బాబాయి పవన్ నటించిన ‘గోపాల గోపాల’ విడుదలవుతుందని ప్రకటించడంతో అబ్బాయి కొంచం సందిగ్ధంలో పడ్డాడు. అసలే బాబాయ్ పేరు చెబితేనే ప్రస్తుతం సినిమా ఇండ్రస్ట్రీలో కాసుల పంట కురుస్తున్న సమయంలో తాను.. తొలి చిత్రంతోనే బాబాయ్ తో పోటీ పడటం ఏంటని అటోచించాడు. కంటెంట్ వున్నవాడి కటౌట్ చాలు అన్నట్లు బాబాయ్ దూకుసుపోతున్న సమయంలో ఎలా అనుకున్నాడు.

సంక్రాంతి పండగకు కొంచెం ముందు డిసెంబర్ మాసం చివర్లో తన ‘ముకుంద’ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. మొదట అనుకున్నవిధంగానే డిసెంబర్ నెలాఖరున క్రిస్మస్ సమయంలో ‘ముకుంద’ సినిమాను విడుదల చేస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలో ఆడియోను విడుదల చేసి, నెలాఖరున సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అబ్బాయి – బాబాయిల సినిమాల ఒకేసారి విడుదలవుతన్నాయ్ అన్న వార్తతో ఏ సినిమాకు ప్రాముఖ్యత ఇవ్వాలి..? అని మదనపడుతున్న మెగా అభిమానులకు ఈ వార్త సంతోషం కలిగించే అంశమే. ఇప్పుడు రెండు సినిమాలను ఎంచక్కా చూడచ్చని భావిస్తున్నారు. దీంతో తొలిచిత్రం ‘ముకుంద’తో వరుణ్ తేజ్ మంచి హిట్ కోట్టాలని, దానిని పవన్ మరో మల్లీస్టారర్ సినిమా ‘గోపాల గోపాల’ కంటిన్యూ చేయాలని మెగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

వరుణ్ తేజ్ సరసన హెడ్గే జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీత దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ‘ముకుంద’ను నిర్మిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles