Nikhil refuses bandla ganesh high remuneration movie offer

nikhil next movie, nikhil refused bandla ganesh offer, bandla ganesh offer to nikhil, nikhil remuneration price amount, bandla ganesh remuneration to heros, tollywood heros remuneration, nikhil next movie with karthikeya director and swamy raa raa director, tollywood latest updates

nikhil refuses bandla ganesh high remuneration movie offer : heavy budget movies producer bandla ganesh first time failed with his concept of money. tollywood rumors that nikhil refused bandla ganesh movie offer even it is with his career best remuneration

తాజ్ మహల్ కొనబోయి ఫెయిలైన బండ్ల

Posted: 11/22/2014 05:12 PM IST
Nikhil refuses bandla ganesh high remuneration movie offer

ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ ఫార్ములా ఉంటుంది. దాన్ని నమ్ముకుని అంతా పని చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఈ ఫార్ములా బెడిసికొడుతుంది. తాజాగా నిర్మాత బండ్ల గణేష్ కు కూడా ఇలాగే అయింది. నమ్మిన ఫార్ములాతో లైఫ్ లో ఫస్ట్ టైమ్ ఫెయిల్ అయ్యాడు. అది కూడా పెద్ద హీరో దగ్గర కాదు చిన్న స్టార్ చేతిలో పరాభవం ఎదుర్కున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ వివరాలను చూస్తే.., భారీ బడ్జెట్ సినిమాలు తీయటంలో పేరు పొందిన బండ్ల గణేష్ ఈ మద్య ఓ మిడిల్ బడ్జెట్ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడట.

ఈ మూవీ కోసం హీరోలను వెతికితే.., నిఖిల్ బెస్ట్ అని హీరోను సంప్రదించాడు. తన సినిమా బడ్జెట్ చెప్పటంతో పాటు.., భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడట. నిఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు తీసుకోని విధంగా రూ.1.25కోట్లను ఈ సినిమాకు రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పాడట. చిన్న హీరో ఎవరైనా ఈ ఫ్యాన్సీ అమౌంట్ కు అంగీకరిస్తారు. కానీ నిఖిల్ మాత్రం నో సర్... సారీ అన్నాడట. రెమ్యునరేషన్ చూసి మరోసారి ఆలోచించుకో అని చెప్పినా సరే.. ప్లీజ్ సార్ ఇప్పుడు చేయలేను అని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. దీంతో భారీ రెమ్యునరేషన్ ఇస్తే ఏ స్టార్ తో అయినా సినిమా చేయవచ్చు అని బండ్ల నమ్మే కాన్సెప్ట్ ఫస్ట్ టైమ్ దెబ్బ కొట్టింది.

ఇంతకీ నిఖిల్ ఇలా ఎందుకు చేశాడని మీ డౌట్ కదా. దానికి మంచి కారణమే ఉంది. నిఖిల్ కు ఈ మద్య ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ రెండు హిట్ సినిమాలు పడ్డాయి. ఈ హిట్లను అందించిన డైరెక్టర్లకు చెరొక సినిమా చేసి పెడతాను అని గతంలోనే మాట ఇచ్చాడట. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు కాబట్టి.., ఈ ఆఫర్ తీసుకోలేను అని చెప్పేశాడట. అంటే డబ్బు కంటే మాటకు నిఖిల్ విలువ ఇస్తాడని స్పష్టం అవుతోంది. ఏదో మూవీలో చెప్పినట్లుగా నిఖిల్ లాంటి వ్యక్తులు కేవలం చూడటానికే కొనటానికి కాదు అని మనం అనుకోవాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nikhil  bandla ganesh  remuneration  movies  tollywood  

Other Articles