Rajinikanth clarity on political entry

rajinikanth on his political entry, rajinikanth latest comment on political life, rajinikanth on politics, rajinikanth says no to politics, rajinikanth lingaa movie, rajinikanth lingaa movie latest update, rajinikanth lingaa movie release date, tollywood latest news updates, koliwood latest news updates

rajinikanth clarity on political entry : tamil super star rajinikanth finally gives clarity on his political entry, in goa capital panaji rajini gives clarity to ndtv in an interview. rajini latest comment on political entry creating high sensation and hurting one of leading party with decission

సింగిల్ స్టేట్ మెంట్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు

Posted: 11/20/2014 03:50 PM IST
Rajinikanth clarity on political entry

కొన్ని రోజులుగా తెగ ప్రచారంలో ఉన్న రాజకీయ అరంగేట్ర అంశంపై క్లారిటీ వచ్చింది. ఇన్నిరోజులుగా ముసుగులో గుద్దులాటగా ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ రివీల్ అయింది. రాజకీయ ప్రవేశంపై తమిళ సూపర్ స్టార్ ప్రకటన చేశాడు. గోవాలో ఓ మీడియా సంస్థతో మాట్లాడిన రజినీ.., ‘‘రాజకీయాల్లోకి రావటం లేదు’’ అని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఇన్ని రోజులుగా నెలకొన్న ఊహాగానాలు, అభిమానులు, రాజకీయ పార్టీల ఉత్కంఠకు తెరపడినట్లయింది. తన నిర్ణయానికి గల కారణాలపై కూడా వివరణ ఇచ్చుకున్నాడు.

గోవా రాజధాని పనాజిలో ప్రారంభమైన అంతర్జాతీయ 45వ ఫిలిం ఫెస్టివల్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓ జాతీయ మీడియా సంస్థ రజినీని ప్రత్యేకంగా ఇంటర్య్వూ చేసింది. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు అని ప్రశ్నించగా.., ‘నాకు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి లేదు’ అని రజినీ సమాధానం చెప్పాడు. అలాగని రాజకీయాలంటే భయమనుకోవద్దన్నారు. పాలిటిక్స్ లోకి వస్తే ప్రజా సేవ చేస్తాను అనే నమ్మకం పూర్తిగా లేదన్నారు. కాబట్టి రాజకీయాల్లోకి రావాలి అనుకోవటం లేదని చెప్పాడు. ఇక ఇప్పటికే తనను పొలిటికల్ ఎంట్రీపై చాలా పార్టీలు సంప్రదించాయని చెప్పారు.

ప్రస్తుత రాజకీయాల్లో అనిశ్చితి నెలకొందనీ.., ఏ పార్టీ కూడా పూర్తిగా స్వచ్ఛమైన ప్రజా సేవ చేయటం లేదని రజినీకాంత్ అభిప్రాయపడుతున్నారు. తమిళ సూపర్ స్టార్ ను చేర్చుకోవాలని బీజేపీ, చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. స్వయంగా అమిత్ షా వంటి అగ్రనేతలు రంగంలోకి దిగి చర్చలు జరిపారు. రజినీ బీజేపీలో చేరితే తమిళనాట ఎక్కడో ఉన్న కమలం ఒక్కసారిగా వికసించటం ఖాయమనే నమ్మకంతో పార్టీలోకి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కాని రజినికాంత్ మాత్రం రాజకీయాల్లోకి వస్తే కలిగే ఇబ్బందులు, విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక సూపర్ స్టార్ తాజా సినిమా ‘లింగా’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. డిసెంబర్ 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  politics  bjp  amitabh bachan  koliwood  panaji  

Other Articles