Nara rohith latest movie rowdy fellow censor completed

rowdy fellow release date, rowdy fellowl latest news, rowdy fellow censor, rowdy fellow photos, rowdy fellow songs, rowdy fellow nara rohith images, rowdy fellow heroine vishaka singh latest, vishaka singh latest hot photos, vishaka singh movie updates, tollywood latest news updates

nara rohith latest movie rowdy fellow censor completed : hero nara rohith latest movie rowdy fellow all set to release on 21st november int both telugu states. nara rohith rowdy fellow completed censor review and movie got clean certificate with u/a

ఆశించినంతగా ఏమి ఉండదట...

Posted: 11/20/2014 08:34 AM IST
Nara rohith latest movie rowdy fellow censor completed

హీరో నారా రోహిత్ తాజా చిత్రం ‘రౌడి ఫెల్లో’ విడుదలకు సిద్ధమయింది. ఈనెల 21న విడుదల అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విడుదలకు ముందు జరగాల్సిన తంతు అంటే సెన్సార్ బోర్డు క్లియరెన్స్ పూర్తయింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటేఈ మూవీలో అభ్యంతకర సన్నివేశాలు లేవు. అందరూ చూడవచ్చు అని క్లీన్ చిట్ ఇచ్చిందన్నమాట. ఈ వార్త సామాన్య ప్రేక్షకులకు సంతోషకరమైనదే కానీ.., మరీ ఎక్కువ మసాలా కోరుకునే వారికి మాత్రం రుచించటం లేదు.

మూవీ మిల్స్ బ్యానర్ పై కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రకాశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు లిరిక్స్ రైటర్ గా ఉన్న కృష్ణ చైతన్య ఈ మూవీతో డైరెక్టర్ గా మారాడు. విశాఖ సింగ్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో నారా రోహిత్ పోలిస్ ఆఫీసర్ పాత్రలో కన్పించనున్నాడు. పవర్ ఫుల్ యాక్షన్ తో పాటు కామెడి కూడా ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది. సినిమాలో రోహిత్ పాత్ర ప్రధానంగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. మూవీ ట్రైలర్స్, పాటలకు మంచి స్పదన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఈనెల 21న వస్తున్న ఈ సినిమా భారీ పోటినే ఎదుర్కోనుంది. 21నే రౌడి ఫెల్లోతో పాటు మరో మూడు సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. ఆది నటించిన ‘రఫ్’ మూవీ శుక్రవారం విడుదల అవుతోంది. ఆదికి ఇది ఏడవ సినిమా కావటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రేణు దేశాయ్ నిర్మించి, డైరెక్ట్ చేసిన తొలి సినిమా ‘ఇష్క్ వాలా లవ్’ తెలుగు డబ్ కూడా శుక్రవారం విడుదల కానుంది. దీనికి తోడు రామ్ గోపాల్ వర్మ సీక్వెల్ సినిమా ‘ఐస్ క్రీమ్2’కూడా 21న విడుదల కానుంది. ఇలా ఒకేరోజు నాలుగు సినిమాలు విడుదల అవుతుండటంతో ఆసక్తికర పోటి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rowdy fellow  nara rohith  vishaka singh  censor  tollywood  

Other Articles

Today on Telugu Wishesh