Gopala gopala movie release date confirmed by producers suresh babu sharat marar on sakranti festival

gopala gopala movie, pawan kalyan, victory venkatesh, sankranti festival, producer suresh babu, producer sharat marar, sriya saran news, tollywood news, telugu news, telugu movies, pawan kalyan latest movie, pawan kalyan gabbar singh movie

gopala gopala movie release date confirmed by producers suresh babu sharat marar on sakranti festival

‘‘గోపాల గోపాల’’.. లీకైన నిర్ధారణ వార్త!

Posted: 11/17/2014 06:34 PM IST
Gopala gopala movie release date confirmed by producers suresh babu sharat marar on sakranti festival

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘గోపాల గోపాల’కు సంబంధించి రోజుకొక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! దాదాపు ఏడాదికిందట షూటింగ్ ప్రారంభమైనా.. ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఫస్ట్ లుక్ రిలీజ్ కాకపోవడంతో విడుదలకు సంబంధించి రకరకాలుగా వార్తలొస్తున్నాయి. మొన్నటికి మొన్న సంక్రాంతి బరిలోకి రిలీజ్ అవుతుందని యూనిట్ వర్గాలు స్పష్టం చేశారు కానీ... పవన్ కల్యాణ్ షూటింగ్ ఇంకా 20 రోజులకుపైగా మిగిలేవుందని, ఇంకా ప్యాచ్ వర్క్ చాలా వుందని, ఈ నేపథ్యంలో సినిమా సంక్రాంతికి కాకుండా ఫిబ్రవరిలో రిలీజ్ కావచ్చుననే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే విడుదల విషయంలో తాజాగా నిర్మాతలు స్పష్టమైన తేదీని చివరకు ఖరారు చేసి, మీడియాలో వస్తున్న వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.

వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ‘గోపాల గోపాల’ చిత్రాన్ని కచ్చితంగా విడుదల చేస్తామని నిర్మాత సురేష్ బాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించి అతి త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే వచ్చే నెలలో ఆడియో విడుదల వేడుక వుంటుందని, సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు. మరోవైపు ఈ సినిమాకు మరో నిర్మాతైన శరత్ మరార్ కూడా ఈ విధంగానే పేర్కొంటున్నారు. పవన్, వెంకటేష్, దర్శకుడు, రచయితల మధ్య మంచి సమన్వయం ఉండడంతో ఆయా సన్నివేశాలు అద్భుతంగా వస్తున్నాయని మరో నిర్మాత శరత్ మరార్ చెప్పారు. కిషోర్ కుమార్ (డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఏదైతేనేం.. ఈ సంక్రాంతికి అభిమానులకు పండుగే పండగ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles