Super star rajnikanth linga movie highest remuneration 60 crores

rajnikanth latest news, rajnikanth remuneration, rajnikanth movies, rajnikanth linga movie, linga movie news, linga movie release date, linga movie news, director ks ravikumar, sonakshi sinha, anushka shetty, rajnikanth linga movie

super star rajnikanth linga movie highest remuneration 60 crores

భారీ పారితోషికంతో వార్తల్లో నిలిచిన ‘లింగా’!

Posted: 11/15/2014 05:52 PM IST
Super star rajnikanth linga movie highest remuneration 60 crores

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తాజాగా ‘లింగా’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే! ఇందులో సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. డిసెంబర్ లో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ‘కొచ్చాడయాన్’ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకాన్ని రజనీతోపాటు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అభిమానులు కూడా ఈ సినిమా విడుదల కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు.. విడుదలకుముందే ఈ సినిమా భారీగా బిజినెస్ చేసేసి, నిర్మాతను సేఫ్ జోన్ లో పెట్టేసింది! ప్రముఖ ఈరోస్ సంస్థ ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ హక్కులను 165 కోట్లకు కొనేసిందని సమాచారం!

ఇదిలావుండగా.. ఈ సినిమాలో నటించినందుకుగానూ రజినీకాంత్ భారీ పారితోషికాన్ని తీసుకున్నారని కోలీవుడ్ సమాచారం! గతంలో ‘రోడో, కొచ్చాడయాన్’ తదితర చిత్రాల్లో నటించినందుకు ఆయన 30, 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! తాజాగా ‘లింగా’ సినిమాకోసం ఆయన 60 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. సినిమా ఒప్పందంలో భాగంగా ఆయన ముందుగానే బిజినెస్ లో వాటాగా తన పారితోషికాన్ని ఆయన మాట్లాడుకున్నారట! ఇప్పటికే ఈ మూవీ రైట్స్ ను ఈరోస్ 165 కోట్లతో కొనేయడంతో.. అందులో భాగంగా రజనీకి 60 కోట్ల పారితోషికం రానుంది! దీంతో.. కేవలం దక్షిణాదినే కాకుండా యావత్ ఇండియా మొత్తం మీద మరే హీరో తీసుకోని స్థాయిలో రజనీ మొదటిసారిగా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajnikanth  linga movie  sonakshi sinha  anushka shetty  eros international  

Other Articles

Today on Telugu Wishesh