Karina kapoor comments on love jihad

karina kapoor comments on love jihad, karina kapoor next movie, karina kapoor latest comments, karina kapoor saif love marriage, saif ali khan next movie, karina kapoor hot photos, love jihad meaning, love jihad latest news, religion issues problems in india

karina kapoor comments on love jihad : bollywood actress karina kapoor made contraversial comments on love jihad, she says no one can't stop a person loving other because of cast or religion. i dont believe in love jihad i believe feeling of love says karina kapoor

కీలక అంశంపై వివాదాస్పద కామెంట్లు వేలుపెట్టి ఇరుక్కున్న కరీనా

Posted: 11/08/2014 04:09 PM IST
Karina kapoor comments on love jihad

దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్న కీలక అంశంపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ వేలు పెట్టింది. తన అభిప్రాయం చెప్పాలన్న ఉద్దేశ్యంలో ఏదేదో మాట్లాడేసింది. దీనిపై ప్రస్తుతం పలు హిందూ ధార్మిక సంస్థలు, మతపర ఉద్యమ సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. మతం, దేశ సమగ్రతకు సంబంధించిన విషయంపై తెలివిగా మాట్లాడాను అనుకుంటోంది కాని అవి అడ్డంగా బుక్ చేసేలా ఉన్నాయి. గాలికి పేయే కంపను ఎక్కడో తగిలించుకున్నట్లుగా రాజకీయాలకు పరిమితం అయిన విషయంలో వేలు పెట్టి, వివాదాస్పద కామెంట్లు చేసింది.

యూపీలో ప్రభావంలో ఉన్న లవ్ జీహాద్ అంశంపై కరీనా స్పందించింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడిన ఈ తార.., తనకు ఇలాంటి వాటిపై నమ్మకం లేదని చెప్పింది. తనకు ప్రేమ, దానిలోని భావంపై నమ్మకం ఉందని చెప్పింది. ప్రేమ అంటే, మాటలతో చెప్పలేని ఒక భావన అని.., ఇద్దరు వ్యక్తుల మద్య ఉండే ఈ ఫీలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కవే అని పేర్కొంది. ప్రేమకు కులం, మతం, వర్గం, ప్రాంతం అనే భేదాలు ఉండవనీ.., మనసులకు సంబంధించిన విషయంగా తెలిపింది.

అలాంటి ప్రేమను హిందూ, ముస్లిం అనే కోణంతో చూడలేమని చెప్పింది. తాను హిందూ, తన భర్త ముస్లిం అయినా సరే పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నాము. సైఫ్ తన అభిప్రాయాలు, మనోభావాలను గౌరవిస్తాడు. అదేవిధంగా తాను కూడా భర్త అభిప్రాయాలను అర్ధం చేసుకుంటాను అని చెప్పింది. కాబట్టి మతం కారణంగా ప్రేమను అడ్డుకోలేము అని చెప్పింది. ఇక్కడే కరీనా కాస్త ఆవేశపడినట్లు కన్పిస్తుంది. మతం పేరుతో ప్రేమను అడ్డుకోలేము అని చెప్పటం ద్వారా లవ్ జీహాద్ కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు అన్పిస్తుంది.

ఒక అమ్మాయి లేదా అబ్బాయి మరొక మతానికి చెందిన అబ్బాయి లేదా అమ్మాయిని ప్రేమిస్తే వారిద్దరూ ఒకరికొకరు ఏ మతం అని అడిగి ప్రేమించుకోలేరు అని చెప్పింది. ఈ ప్రకటనపై ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరీనా కామెంట్లు పరోక్షంగా లవ్ జిహాద్ కు సానుభూతి చూపించినట్లుగా ఉందంటున్నాయి. అయితే కరీనా లవ్ జీహాద్ కు మద్దతు పలుకుతుందని వారు అనటం లేదు కానీ.., ఆమె కామెంట్లు పరోక్షంగా ఈ మత మార్పిడి ఉద్యమం ఉందనలేము అనే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇదే సమయంలో లవ్ జీహాద్ పై నమ్మకం లేదు అని కరీనా ప్రకటించింది. అంటే ఇలాంటి ప్రేమలు ఉండవని చెప్పినట్లు అర్ధం. ఈ కామెంట్లు కరీనాకు ముప్పు తెస్తాయా... లేక లైట్ అయిపోతాయా అనేది చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karina kapoor  love jihad  latest news  bollywood  

Other Articles

Today on Telugu Wishesh