Ajay devagn punjabi song in action jackson

ajay devgn next movie, ajay devagn in action jackson, ajay devagn punjabi mast song, ajay devagn songs latest updates, action jackson movie updates, action j ackson release date, punjabi mast song online, punjabi pop songs, bollywood latest news

ajay devagn punjabi song in action jackson : bollywood star hero ajay devagn made a hilarious performance in punjabi mast song of action jackson. punjabi mast song in action jackson movie gettng good response from fans

పంజాబీలో దుమ్ము దులిపేశాడట కదా...

Posted: 11/08/2014 03:30 PM IST
Ajay devagn punjabi song in action jackson

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ లేటెస్ట్ మూవీ ‘యాక్షన్ జాక్సన్’ విడుదలకు ముందే అభిమానుల్లో క్రేజ్ పొందుతోంది. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ లక్ష్యంతో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే... పాటలు విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ‘పంజాబి మస్త్’ పాట తెగ పాపులర్ అయింది. ఈనెల ఆరున విడుదలైన ఈ సాంగ్ ను శనివారం మధ్యాహ్నం వరకు మూడున్నర లక్షల మంది చూశారు. యూట్యూబ్ లో ఈ పాట గురించి ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.

ఫాస్ట్, అండ్ స్లో బీట్ కలిపి కొట్టిన ఈ పాటలో సింపుల్ స్టెప్పులతో అజయ్ దుమ్ములేపాడని ఫ్యాన్స్ అంటున్నాడు. ఇక సోనాక్షి సిన్హా గ్లామర్ పాటకు అదనపు అందాన్ని తీసుకొచ్చింది. సమీర్ అంజాన్ రాసిన ఈ పాటను, హిమేష్ రెష్మియా కంపోజ్ చేశారు. అంకిత్ తివారి పాడిన ఈ పాటలో పంజాబి లుక్ తో సైడ్ డాన్సర్ల స్టెప్పులు, దీనికి తోడు సెట్ కూడా చాలా బాగా సూట్ అయింది. అందుకే ఈ పాటకు ఇంత క్రేజ్ వచ్చింది. వినేకొద్ది వినాలన్పించే ఈ పాటను మీరూ ఓ సారి విని చూడండి.., ఆ తర్వాత మరోసారి వినకుండా ఉండలేరు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : action jackson  ajay devgn  punjabi song  bollywood latest  

Other Articles