Govindudu andarivadele shooting again started

ram charan, ram charan teja, ram charan teja wife, ram charan teja wiki, ram charan teja movies, ram charan teja fan died, govindudu andarivadele song, charan teja movies list, ram charan teja upcoming movies, govindudu andarivadele, govindudu andarivadele movie, govindudu andarivadele review, govindudu andarivadele latest news, govindudu andarivadele gossips, govindudu andarivadele movie free download, govindudu andarivadele rating, govindudu andarivadele latest updates, govindudu andarivadele public talk, kajal, kajal hot, kajal in govindudu andarivadele, latest news, tollywood

govindudu andarivadele movie is back to shooting spot for a song balance in acutal film : ram charan is working hardly with out dasara holidays and celebrations for song balance in govindudu andarivadele movie

బండ్ల వల్ల మళ్ళీ గోవిందుడి షూటింగ్

Posted: 10/02/2014 12:15 PM IST
Govindudu andarivadele shooting again started

సినిమా విడుదల అయ్యాక కూడ ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం హీరో చరణ్ సహా యూనిట్ అంతా షూటింగ్ బిజీలో ఉంది. త్వరగా షూటింగ్ పూర్తి చేస్తే.., గోవిందుడి పని అయిపోతుంది అని ఆరాటపడుతున్నారు. సినిమా విడుదల అయ్యాక షూటింగ్ గొడవ ఏమిటి అనుకుంటున్నారా..?. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో ఒక పాట లేకుండానే రిలీజ్ అయిందన్న విషయం తెలిసిందే. ఇచ్చిన మాట కోసం బాగా తాపత్రయ పడ్డ బండ్ల గణేష్ అక్టోబర్ 1న సినిమా విడుదల చేయటం కోసం ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగించుకున్నాడు. ఇదే క్రమంలో ఓ పాట షూటింగ్, ఎడిటింగ్ పూర్తి కాకపోవటంతో దాన్ని కూడా సినిమా నుంచి తాత్కాలికంగా ఎలిమినేట్ చేశాడు.

బడ్జెట్ తో మంచి సెట్టింగులు వేసి కలర్ ఫుల్ గా తీసిన ఈ పాటను తొలగించటంపై కాస్త అభ్యంతరాలు వచ్చాయి. అయితే విడుదల ముఖ్యం కాని పాట కాదు అని సర్ధిచెప్పాడు. కావాలంటే ఆ పాటను సినిమా విడుదల తర్వాత షూట్ చేసి జతచేద్దాం అని సలహా ఇచ్చాడు. దీంతో సరే అన్నట్లుగా పాటను వదిలేసి సినిమాను విడుదల చేశారు. మూవీకి హిట్ టాక్ రావటంతో.., అదనపు హంగు అద్దటం కోసం మిగిలిన పాటను యాడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సినిమా యూనిట్లో ఎవరూ దసరా సెలవులు తీసుకోకుండా పాట పూర్తి చేయటం కోసం కష్టపడుతున్నారని తెలుస్తోంది. అటు ఈ పాట కోసమే చెర్రి అమెరికా పర్యటనను కూడా వాయిదా వేసుకున్నాడు. ముందు పాట.., ఆ తర్వాతే మిగతా పనులు అన్నట్లుగా డిసైడ్ అయి మరి చరణ్ డాన్స్ ప్రాక్టిస్ చేస్తున్నాడట. ఎంతో కష్టపడి తీసిన ‘గోవిందుడి అందరివాడేలే’ సినిమా అందరి మన్ననలు పొందుతోంది. అదే విధంగా చాలా కష్టపడి తీస్తున్న ఈ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే సినిమాకు మరో ప్లస్ పాయింట్ అవుతుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govindudu andarivadele  shooting  ram charan  song  

Other Articles