Pawan kalyan and jr ntr movies for pongal

nenorakam, nenorakam first look, nenorakam latest, nenorakam news, nenorakam photos, nenorakam ntr, nenorakam songs, nenorakam review, ntr movies, ntr latest, ntr fans, ntr upcoming movies, ntr marriage, rabhasa movie, rabhasa movie download, latest news, tollywood, pawan kalyan, pawan kalyan fans, pawan kalyan movies, pawan kalyan latest, pawan kalyan marriage, pawan kalyan divorce, pawan kalyan son, pawan kalyan daughter, pawan kalyan upcoming movies, pawan kalyan comments, gopala gopala, gopala gopala movie, gopala gopala review, gopala gopala songs, gopala gopala photos

next year sankranthi will be more colourful with two star heros movies that of pawan kalyan and jr ntr : pawan kalyan new movie gopala gopala and ntr movie nenorakam will release by january 2015 as a sankranti gift to telugu people

పవన్, ఎన్టీఆర్ కలిసి వస్తారట.. ఇక ఫ్యాన్స్ కు పండగే పండగ

Posted: 09/27/2014 12:51 PM IST
Pawan kalyan and jr ntr movies for pongal

ఒకే సారి రెండు చంద్రులను చూసే హంగామా తెలుగు ప్రేక్షకులకు త్వరలోనే దక్కనుంది. స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కలిసి వచ్చేందుకు ముహుర్తం ఖరారు చేసుకుంటున్నారు. వీరిద్దరు సంక్రాంతికి తెలుగు రాష్ర్టాల్లో బయటకు వచ్చేందుకు చకచకా అడుగులు వేస్తున్నారు. అయితే ఇదంతా వారి కొత్త సినిమాల గురించి. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలు రెండూ.. దాదాపు సంక్రాంతి సమయంలోనే విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ సారి డబుల్ సంక్రాంతి సంబరాలు చేసుకోక తప్పదు.

పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా ‘గోపాల గోపాల’. హిందీ హిట్ సినిమా ‘ ఓ మై గాడ్’ ఆధారంగా తీన్ని తీస్తున్నారు. ఈ మల్టీస్టారర్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు. వాస్తవానికి వెంకటేష్ సినిమాలో హీరో.., పవన్ కృష్ణుడి క్యారెక్టర్లో నటిస్తున్నాడు. కాని పవన్ సినిమాలో ఉండటంతో ఆయన బేస్ గా అంతా మాట్లాడుకుంటున్నారు. గోపాల సినిమా పేరు చెప్తే.., అంతా పవన్ గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ శ్రియ పవన్ (శ్రీకృష్ణుడి)కి పరమభక్తురాలు. కధ కాస్త పక్కనబెడితే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మద్యే ప్రారంభం అయిన షూటింగ్, మరో రెండు నెలల్లో పూర్తి చేసుకుని.., జనవరిలో మొదటి లేదా లేదా రెండవ వారంలో విడుదల అవుతుందని అటున్నారు.

ఇక ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా ‘నేనోరకం’ ( టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు) షూటింగ్ కూడా  మొదలయ్యింది. రెండ్రోజుల క్రితం ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లో ప్రస్తుతం యాక్షన్ సీన్లు జరుగుతున్నాయి. పూరి జగన్నాధ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వేగంగా సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరున్న పూరీ.., తలుచుకుంటే రెండు నెలల్లో సినిమాను తీసి.. విడుదల చేయగలడు. కాబట్టి సెప్టెంబర్ చివరలో ప్రారంభం అయిన సినిమా నవంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుని.. జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎన్టీఆర్ ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బండ్ల గణేష్ ఈ మూవీకి నిర్మాతగా ఉంటే.., దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్. వక్కంతం వంశీ కధ అందిస్తున్నాడు. ఇద్దరు హీరోల సినిమాలు దాదాపు ఒకే సమయంలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ముగ్గురు హీరోలు. దీంతో సంక్రాంతి పోరు విక్టరీ కళ్యాన్ వర్సెస్ ఎన్టీఆర్ లా ఉంటుంది అని ఫిలింనగర్ వర్గాల టాక్. చూడాలి మరి సంక్రాంతి రికార్డులు ఎవరు తెరుస్తారు.. కొత్తగా ఎవరు నమోదు చేస్తారో. మనమైతే రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుందాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nenorakam  gopala gopala  jr ntr  pawan kalyan  

Other Articles