Bellamkonda suresh to produce his son srinivas second movie

bellamkonda suresh, bellamkonda suresh wiki, bellamkonda suresh movies, bellamkonda suresh family, bellamkonda suresh suicide, bellamkonda srinivas wiki, bellamkonda srinivas family, bellamkonda srinivas movies, bellamkonda srinivas latest, bellamkonda family, latest news, movies, tollywood

bellamkonda suresh only produce his son next movie presently he overcoe from loans and barrowings : bellamkonda now get out of loans and ready to produce son srinivas second movie

శ్రీను సినిమా ఎవరూ చేయవద్దంటున్న సురేష్

Posted: 09/26/2014 10:02 AM IST
Bellamkonda suresh to produce his son srinivas second movie

నిర్మాత బెల్లంకొండ కష్టాలు తీరాయి. ఆయనకు మెడపై ఉన్న అప్పుల్లో చాలావరకు తీరిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఎలా తీర్చాడు అనేది బయటకు తెలియటం లేదు కానీ.., ప్రస్తుతం అప్పులవాళ్లు కలవటం కాస్త తగ్గించారట. దీంతో కష్టాలు దాదాపు తీరిపోయినట్లే అని ఫిలింనగర్ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక విషయానికి వస్తే.., తన కొడుకు శ్రీనివాస్ రెండవ సినిమాను బెల్లకొండ సురేష్ నిర్మాస్తున్నాడట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను నిర్మించాలని ముందుగా మరో నిర్మాతను సురేష్ కోరగా అందుకు ఆయన ఓకే చెప్పటం కూడా జరిగిపోయింది.

సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే అప్పట్లో అప్పుల వల్ల చేతిలో డబ్బులు లేక సినిమా చేయలేకపోయాను కానీ.., ఇప్పుడు కాస్త కోలుకున్నాను కాబట్టి.., సినిమా చేస్తానని సురేష్ అంటున్నాడట. అంటే శ్రీను రెండవ సినిమా కూడా సురేష్ నిర్మిస్తాడని దాదాపు ఖరారు అయింది. ఇందుకోసం మిగిలి ఉన్న ఫైనాన్స్ ఇబ్బందులను కూడా క్లియర్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. నవంబర్ మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.

వరుసగా రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ కావటంతో బెల్లంకొండ కోలుకోలేకపోయాడు. శ్రీను హీరోగా వచ్చిన తొలి సినిమా ‘అల్లుడు శీను’కు భారీగా డబ్బు ఖర్చు చేశారు. అయితే సినిమా ఫ్లాప్ అయింది. దీంతో సురేష్ అప్పుల్లోకి కూరుకుపోయాడు. ఇదే సమయంలో తాను నిర్మించిన మరో సినిమా ‘రభస’ కూడా నడవక పోవటంతో ఈ బాధలు మరింత పెరిగాయి. రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఆడకపోవటంతో అప్పులు ఇచ్చినవాళ్ళు డబ్బులు కావాలని ఒత్తిడి చేయటం మొదలు పెట్టారట. వాళ్ళ బాధలు భరించలేక.., వెంటనే చాలావరకు అప్పులు తీర్చేశాడని అంటున్నారు. రెండవ సినిమా అయినా హిట్ కావాలని తెలుగు విశేష్ కోరుకుంటోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bellamkonda srinivas  bellamkonda suresh  latest news  tollywood  

Other Articles