Why inspiring movies not coming in tollywood

bhag milka bhag, bhag milka bhag movie, bhag milka bhag movie free download, bhag milka bhag songs, bag milka bag trailor, mary kom, mary kom latest, mary kom movie free download, mary kom priyanka chopra, aagadu, rabhasa, govindudu andarivadele, latest movies, telugu famous movies, evergreen movies, tollywood

telugu movie makers allways thought about making movies with love stories and action movies only : there is a discussion that why films like bhag milka bhag and marykom movies not making in tollywood

ఆ సినిమాలు టాలీవుడ్ లో ఎందుకు రావు..?

Posted: 09/24/2014 05:46 PM IST
Why inspiring movies not coming in tollywood

టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎందరి బ్రతుకుల్నో మార్చింది. పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్ వచ్చినవారెంతమందో ఇవాళ కోటిశ్వరులై బంజారాహిల్స్ లో తిరుగుతున్నారు. అయితే వారు వచ్చిన పరిస్థితులను మర్చిపోతున్నారు. పూర్తి కమర్షియల్ గా మారిపోయి సినిమాలు తీస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలి అనే భావన కంటే.., పైసలు సంపాదించాలి అనే కోరిక ఎక్కువయి పోయింది. ఓ వైపు బాలీవుడ్ దిగ్గజాలు సైతం ‘‘మేరీ కోమ్’’ ‘‘బాగ్ మిల్కా బాగ్’’ సినిమాలు చేసేందుకు కష్టపడుతుంటే..., మన టాలీవుడ్డు ప్రముఖులు కనీసం ఆ వైపుగా ఆలోచించటం లేదు. ఎందుకు వారు ఆ కధలు తీయలేకపోతున్తనారు? అని ప్రశ్నలు ప్రస్తుతం చాలామంది మదిలో మెదులుతున్నాయి.  

సినిమా అంటే కేవలం వినోదమే కాదు. సమాజంపై ప్రభావం చూపే బలమైన ప్రసార సాధనం కూడా. దర్శకుడు చూపించే ప్రతి సన్నివేశం.., కధలోని ప్రతి పాయింట్ కూడా ప్రేక్షకుడికి చేరువ అవుతుంది. ఇంట్లో అమ్మ చెప్పినా అంత శ్రద్దగా వినకపోవచ్చు కానీ.., సినిమా హీరో చెప్తుంటే మాత్రం ఆసక్తిగా వింటాము. అలాంటి ప్రభావం ఉన్న సినిమాలు మనకేం చూపిస్తున్నాయి అంటే చెప్పుకోవటానికి చాలా సిగ్గుగా ఉంది. అయినా మారాలంటే మాట్లాడక తప్పదు కాబట్టి చెప్తున్నాము. ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాలు చూస్తే.., ఒక ప్రేమకధ, ఒక యాక్షన్ కధ లేదా రెండు కలిపి ఒకే కధ. ఇలాంటి సినిమాలు మాత్రమే వస్తున్నాయి. ఎలా ప్రేమించుకుంటారు... ఎలా వెళ్లిపోతారు.. పెద్దలు ఎప్పుడు ఒప్పుకుంటారు..? ఇవే ఇప్పుడు తెలుగు సినిమాల్లో చూపిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమాలు వచ్చినా అందులో కూడా ప్రేమను పెట్టి సగం సినిమా అయ్యిందనిపిస్తున్నారు.

మేరీకోమ్ మనకురాదేం..?

రొమాన్స్, డాన్స్, ఫైట్, క్లైమాక్స్ ఫైట్ ఇవి తప్ప మరొకటి ఇప్పటి తెలుగు సినిమాల్లో కన్పించటం లేదు. కామెడి హీరోలు అయినా కనీసం మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తున్నారు కానీ.., పెద్ద హీరోలు, డైరెక్టర్లు ఎవరూ అటు వైపు వెళ్ళే ఆలోచన చేయటం లేదు. ఓ వైపు బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్లు.., కాల్షీట్లు పక్కనపెట్టి మరీ ‘మేరీకోమ్’ సినిమా కోసం జిమ్ కు వెళ్ళి ఎంతో కష్టపడి సాధన చేసి సినిమాలు చేసింది. ఈ సమయంలో ఇతర నిర్మాతలు కోట్ల డబ్బు పట్టుకుని ప్రియాంక కోసం ఎదురుచూశారు. కాని ఆమె కోమ్ సినిమాకే ఆసక్తి చూపింది. ఓ సామాన్య మహిళ ఒలంపిక్ పతకం సాధించేందుకు పడిన కష్టాలను స్వయంగా తెలుసుకుని పాత్రలో లీనమై ప్రియాంక నటించింది. ఈ సినిమా ఆశించిన హిట్ సాధించింది. సమాజానికి పనికివచ్చే సినిమాలు తీస్తే ప్రేక్షకులు చూడరు అనే సినీ ప్రముఖులకు ఇది చెంపదెబ్బ.

‘మిల్కా’కు ఏమయింది

కడుపేదరికంలో పుట్టినా.., పాలకోసం మొదలు పెట్టిన పరుగు అతడి జీవితాన్నే మార్చేసింది. అందరూ లక్ష్యం కోసం పరుగులు పెడితే.. మిల్కా మాత్రం పరుగే లక్ష్యంగా పరిగెత్తాడు. విజయం సాధించాడు. అతడి జీవితం నేపథ్యంగా వచ్చిందే ‘‘బాగ్ మిల్కా బాగ్’’ ఈ సినిమా గురించి తెలియని సినిమా అభిమానులు ఎవరూ ఉండరు. అంత ఫేమస్ ఈ సినిమా. తమిళం, కన్నడం, మళయాలం ఇలా బాష ఏదయితేనేం.., అక్కడ హిట్టయితే ఇక్కడా హిట్టు అనే కాన్సెప్టుతో కథలు కాపి చేస్తున్నారు. కాని ఈ సినిమాను తెలుగులో డబ్ చేద్దామనే ఆలోచన కూడా ఎవరికి రాలేదు. తెలుగులో ‘‘ప్రతిఘటన’’, ‘‘ఒసేయ్ రాములమ్మ’’, ‘ప్రతిధ్వని’, ‘నిర్ణయం’లాంటి సినిమాలు వచ్చి ఎంతకాలమయింది. అప్పుడున్న ప్రజా సమస్యలు ఇప్పుడు లేవా అంటే.., వాటికి రెండింతలు పెరిగాయి. మరి వాటినే చూపించటానికి ఎందుకు దైర్యం చేయటం లేదు మన దర్శక నిర్మాతలు..? సినిమాలు చేస్తామని ఎందుకు ముందుకు రావటంలేదు టాలీవుడ్ అభిమాన హీరోలు..?

జోదాను డబ్ చేశారు.. కాని గోల్కొండను వదిలేశారు.. !!

జీవితమంతా డబ్బు, వ్యాపారం ఇదే ఇతివృత్తంగా మారిపోయింది టాలీవుడ్ కు. అందుకే హిట్ అయిన పరబాషా సినిమాలను కాపి కొడుతున్నారు. కాని సొంతంగా సినిమాలు చేసేందుకు సాహసించటం లేదు. ఎక్కడో రాజస్థాన్ లో ఒకప్పటి రాజ్యానికి సంబంధించి బాలీవుడ్ లో ‘‘జోధా అక్బర్’’ సినిమా తీస్తే అది మామూలు హిట్టు కాలేదు. ఇంకేముంది వెంటనే తెలుగులో డబ్ చేసిన ‘‘జోదా అక్బర్’’ వెంటనే విడుదల అయింది. కాని మన గోల్కొండ కోట గురించి.., నిజాం నవాబు, భాగ్యమతి ప్రేమ వ్యవహారం గురించి ఎవరూ సినిమా తీయలేదు.  ఎందుకంటే ‘‘దూరపు కొండలు నునుపు’’ అనే సామెత ఉందికదా. మన చరిత్రకు ఏం తక్కువ.., ఎక్కడా తీసివేయలేనంతగా మనకూ చరిత్ర, సాంప్రదాయం ఉంది. కాని సినిమాల్లో కన్పించటం లేదు.

సినిమాల్లో ఉద్యమం.. సినిమాపై ఉద్యమం

సినిమాలు సమాజంపై చాలా ప్రభావం చూపుతాయని మనం ముందుగానే చెప్పుకున్నాం. సినిమాల్లో చూపించే ప్రతి సన్నివేశం ప్రేక్షకులపై, సమాజంపై ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు సినిమాల్లో ప్రజా సమస్యలను చూపించి ప్రజలను చైతన్యవంతం చేశారు. ఆ రోజుల్లో సినిమాలను చూసి చాలామంది ఆదర్శవంతమైన జీవితం గడిపారు, చైతన్యవంతమయ్యారు. కాని ఇప్పుడు వస్తున్న సినిమాలు వివాదం లేకుండా బయటకు వస్తే చాలు. ఐదు సినిమాలు బయటకు వస్తే.., వాటిలో మూడింటిపై వివాదమే ఉంటుంది. అప్పట్లో సినిమాలు చూసి ఉద్యమిస్తే... ఇప్పుడు ప్రజలే సినిమాలపై ఉద్యమించే స్థాయికి పరిశ్రమ దిగజారిందా... ఎదిగిందా? వారికే తెలియాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marykom  govindudu andarivadele  tollywood  cinema  

Other Articles