Comedian ms narayana to get guinness records

guinnes record, guinness record for ms narayana, guinness record list, guinness records 2014, latest guinness record, latest records, limca book of records, book of records, ms narayana, ms narayana wiki, ms narayana comedy, ms narayana family, ms narayana funny, ms narayana videos, ms narayana latest, ms narayana to get guinness record, tollywood, latest news, telugu comedy, telugu jokes

telugu famous comedy actor m s narayana soon going to get guinness record with his acted film track record : till now ms narayana completed more than 600movies in his career and its going on so he has chance of getting guinness record

నారాయణకు మరో కీర్తి కిరీటం గిన్నీస్ బుక్ లో చోటు..?

Posted: 09/21/2014 10:51 AM IST
Comedian ms narayana to get guinness records

తెలుగు పాపులర్ కమెడియన్ ఎం.ఎస్. నారాయణ పుస్తకంలో మరో కొత్త పేజి తెరవబడుతోంది. అదే గిన్నిస్ బుక్ రికార్డు పేజి. సినిమాతల్లికి ఆయన చేసిన సేవలతో ఈ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధం అవుతున్నాడు. తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన కమెడియన్ గా రికార్డు నెలకొల్పటం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆరువందలకు పైగా సినిమాల్లో ఎం.ఎస్ నటించి నవ్వించారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో ఈ ట్రాక్ రికార్డు పెరుగుతూనే ఉంది. ఇండస్ర్టీలో నారాయణకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తన ముఖంతోనే ప్రేక్షకులకు నవ్వు తెప్పించే కామెడి ఐకాన్ నారాయణ.

1951లో పుట్టిన ఎం.ఎస్. నారాయణ పూర్తిపేరు మైలవరపు సూర్య నారాయణ. తెలుగు సినిమాలో కమెడియన్ గా డైరెక్టర్, రచయితగా పలు విభాగాల్లో సేవలందించారు. అయితే కమెడియన్ గానే ఎక్కువగా పాపులర్ అయ్యారు. అలా ఆయన కామెడితో ఇప్పటివరకు 600పైగా సినిమాల్లో నటించారు. ఇప్పటివరకు ఐదు నంది అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు కమెడియన్లలో బ్రహ్మానందం 750పైగా సినిమాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డులో ఉండగా.. అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాల్లో నటించిన వ్యక్తిగా నారాయణ ఉన్నట్లు తెలుస్తోంది.

ఏ పాత్రలో ఉన్నా.., అందులో పూర్తిగా ఒదిగిపోయి నవ్వించటం ఎం.ఎస్ సొంతం. తాగుబోతు పాత్ర అయినా, తండ్రి పాత్ర అయినా.., పిల్లలకు పాఠాలు చెప్పే లెక్చరర్, క్యారీ బ్యాగులు వేసుకున్న ఫైర్ స్టార్ హీరో అయినా సరే ఇచ్చిన ప్రతి పాత్రకు పూర్తి న్యాయం చేసే వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే కామెడి దిగ్గజాల్లో ఒకరిగా ఉన్న వ్యక్తిని పక్కనబెట్టి మరీ ఎం.ఎస్.కు ఆఫర్లు ఇస్తున్నారు. ఇలా ఒకే సమయంలో రెండు, మూడు సినిమాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు రెండు తమిళ సినిమాల్లో కూడా నటించాడు నారాయణ. ఏ బాషలో నటించినా నవ్వించటమే ఆయనకు తెలుసు.

ఇక కేవలం నటనకే పరిమితం కాకుండా సినిమా రంగంలోని ఇతర విభాగాల్లో కూడా సేవలు అందించారు. ఎనమిది సినిమాలకు మాటలను రాశారు. అంతేకాకుండా కొడుకును హీరోగా పెట్టి ‘కొడుకు’ అనే సినిమాను తీశారు. అటు కబడ్డీ, కబడ్డీ అనే సినిమాలో ఓ పాట కూడా పాడారు. ఇలా విభిన్నమైన విభాగాల్లో ప్రావిణ్యం సంపాదించారు. అయినా కామెడి గురుగా పేరు పొందారు. ఇలా నవ్విస్తూ జీవితం సాగిస్తున్న ఎం.ఎస్. నారాయణ పేరు త్వరలోనే గిన్నిస్ బుక్ రికార్డులో చేరాలని అంతా కోరుకుందాం.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms narayana  guinnes record  latest news  tollywood  

Other Articles