Producer shocks by thamanna s remuneration rate

thamanna, thamanna bhatia, thamanna bhatia wiki, thamanna family, thamanna rumors, thamanna affair, thamanna latest, thamanna hot photos, thamanna photos hd, latest news, tamil movies, telugu movies, koliwood, tollywood, bollywood, rajini murugan movie, shiva karthikeyan

thamanna bhatia raised her remuneration for upcoming movies and recently a tamil producer shocks by her rate of remuneration : producer of rajini murugan shocks by thamanna demanded remuneration to act

తమన్నాది చూసి నిర్మాతకు తడిచిపోయింది

Posted: 09/19/2014 03:22 PM IST
Producer shocks by thamanna s remuneration rate

‘‘ఇంటి దీపం కదా అని ముద్దుపెట్టుకుంటే మూతి కాల్చిందన్నట్లుంది’’ హీరోయిన్ తమన్నా వ్యవహారం. తెల్ల తోలు చూసుకుని మురుస్తున్న ఈ అమ్మడు.., తనకున్న డిమాండ్ తో పారితోషికం పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్కువ తీసుకుంటుంది అనే టాక్ ఉండగా ఇది మరీ ఎక్కువయిపోయింది. తాజాగా ఓ తమిళ నిర్మాత అయితే ముద్దుగుమ్మ రేటు తెలిసి మూర్చపోయాడట. తన మ్యాజిక్ ఫిగర్ చెప్పే సరికి ఆయనకు నోటమాటరాలేదని టాక్ విన్పిస్తోంది. అలా రేటుతోనే భయపెడుతోంది మిల్కీబ్యూటి.

దీనికి సంబంధించిన వివరాలను చూస్తే., తమిళంలో ‘రజిని మురుగన్’ అనే సినిమాను హీరో శివకార్తికేయన్ తో తీస్తున్నారు. ఇందులో హీరోయిన్ కోసం వెతగ్గా.., వెతగ్గా.. తమన్నా పేరు తగిలింది. స్వయంగా హీరో కార్తి పాల బుగ్గల పిల్ల తన పక్కన ఉంటే బాగుంటుంది అని చెప్పటంతో కాదనలేక నిర్మాత ఆమె దగ్గరకు వెళ్ళాడు. దీంతో బాలీవుడ్డు.., ఆ వుడ్డు, ఈ వుడ్డు అని పేర్లు చెప్పి.. అక్కడ నాకు అంత కట్టబెడుతున్నారు. మరి మీరు ఆ మొత్తం ముట్టచెపుతారా..? అని అడిగిందట. అంత అయితే ఓకే లేకపోతే కష్టం బాబా అని చెప్పేసిందట.

ఇక ఈ రేటు విన్న నిర్మాత ఒక్కసారిగా షాకయ్యాడు. డబ్బులు అడుగుతుందా... చెట్లకు కాసే ఆకుల్ని తీసుకురమ్మంటుందా? అనుకున్నాడు. వెంటనే తేరుకుని మాది అంత పెద్ద సినిమా కాదమ్మా.. ఏదో కొంత అయితే ఓకే కాని.., అంత మొత్తం అయితే వల్ల కాదు అని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సమాధానంగా చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అనేది నా సమస్య కాదు.. నేను చేస్తున్నానా, లేదా అనేదే విషయం ఇక్కడ అని చెప్పేసింది. ఇంక చేసేది లేక ఇదేమి రేటురా బాబు అనుకుంటూ అక్కడి నుంచి చిన్నగా వెళ్లిపోయినట్లు తమిళ వర్గాలంటున్నాయి. చూడాలి మరి ఈ డిమాండ్ ఎంతకాలం ఉంటుందో..?


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajini murugan  latest news  thamanna  koliwood  

Other Articles