చిరంజీవి కుటుంబంతో పవన్ కు అంతగా సఖ్యత లేదని కొద్దికాలంగా మీడియాలో తెగ కధనాలు, ఊహాగాన ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే అవకాశం వచ్చిన ప్రతి సారి మెగా ఫ్యామిలీ తామంతా ఒక్కటే అని చాటుతోంది. సోమవారం జరిగిన ఆడియో విడుదల సమయంలో కూడా పవన్ త్వరలోనే వస్తాడని చిరంజీవి చెప్పటం జరిగింది. అయితే వీరి కుటుంబాలకు సంబంధించి ఇప్పుడో ఫొటో నెట్ లో హల్ చల్ చేస్తోంది. అదే పవన్ కూతురు ఆద్య చిరుంజీవి కలిసి దిగినది. ప్రస్తుతం ఈ ఫొటో కోసం మెగా అభిమానులు నెట్లో, సోషల్ నెట్వర్క్ సైట్లలో తెగ వెతుకుతున్నారు.
చరణ్ తాజా సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్ చూసేందుకు ఓ రోజు భార్యతో కలిసి చిరంజీవి స్పాట్ కు వచ్చాడు. అక్కడ చిరంజీవితో కలిసి ఓ అమ్మాయి ముచ్చటించింది. మెగాస్టార్ ఒళ్లో కూర్చోబెట్టుకుని షూటింగ్ చూసాడు. అటు మెగా స్టార్ భార్య సురేఖ కూడా కాసేపు ముచ్చటించి దగ్గరకు తీసుకుని పలకరించింది. సినిమా మేకింగ్ వీడియోలో ఈ సన్నివేశం కూడా పెట్టగా.., వీడియో చూసిన కొందరు మీడియా మిత్రులు వెంటనే గుర్తు పట్టేశారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య. ప్రస్తుతం రేణు పవన్ విడిపోయినా.., వారి పిల్లలు కొద్దికాలం పూణేలో తల్లి వద్ద ఉంటూ., కొద్ది రోజుల పాటు తండ్రి దగ్గర ఉండేందుకు హైదరాబాద్ వస్తున్నారు. అలా ఈ మద్య ఆద్య హైదరాబాద్ కు వచ్చినపుడు అన్నయ్య సినిమా షూటింగ్ స్పాట్ కు వచ్చి పెదనాన్నతో ఆప్యాయంగా ముచ్చటించింది. అటు మెగాఫ్యామిలీ కూడా చిన్నారిని దగ్గరకు తీసుకుని ప్రేమను చూపించారు. మెగా ఫ్యామిలీలో మద్య విభేదాలు లేవని ఈ ఫొటో నిజం చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jan 27 | మెగాస్టార్ చిరంజీవి.. సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఆచార్య. కరోనా అన్ లాక్ నేపథ్యంలో అన్ని చిత్రాలు తమ షూటింగ్ ను పూర్తి చేసుకుని ఏకంగా విడుదలకు... Read more
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more