Allu arjun body weight puts off

allu arjun, allu arjun body weight, allu arjun wife, allu arjun movies, allu arjun latest, allu arjun marriage, bunny, allu arjun latest movies, allu arjun latest photos, trivikram, trivikram srikivas, body weight loss tips, body weigh gain tips, body mass index, bmi

allu arjun puts off his body weight for trivikram srinivas movie : bunny body weight decreased by ten kgs for his up coming movie

బరువు తగ్గిన బన్ని

Posted: 09/12/2014 03:05 PM IST
Allu arjun body weight puts off

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరింత స్టైల్ గా కన్పించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇందుకోసం తన బాడి షేపులను, బరువును మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమా కోసం అల్లు అర్జున్ బరువు తగ్గాడట. అది కూడా ఒకటి రెండు కేజీలు కాదు ఏకంగా పది కేజీల వరకు బరువు తగ్గాడట. దీంతో బాడీతో కండలు కలిగి హ్యాండ్ సమ్ గా కన్పించే బన్నీ.., ఇప్పుడు స్పోర్ట్స్ లుక్ తో మరింత స్ర్టెంథీగా కన్పిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా సినిమాల కోసం బన్ని పలుమార్లు స్టైల్స్ మార్చుకోవటంతో పాటు.., బాడీ షేపులను కూడా మార్చకున్నాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాను చేస్తున్నాడు. ఇందులో నటించేపాత్ర కోసం బన్ని బరువు తగ్గాలని శ్రీనివాసుడు చెప్పాడట. ఇంకేముంది పాత్రకు న్యాయం చేయటం కోసం జిమ్ లో బాగా కష్టపడి బరువు తగ్గించుకున్నాడని సన్నిహితులు అంటున్నారు. అంతేకాకుండా సినిమాలో యాక్షన్ సీన్లకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడని అంటున్నారు. బన్నీకి కెరీర్ లో పెద్ద హిట్ ఇచ్చిన ‘జులాయి’ డైరెక్టర్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుండటంతో ఆ సినిమా మరింత హిట్ కావాలని ఈ కష్టాలు పడుతున్నాడు.

ఇక అల్లు అర్జున్ కు పోటిగా విలన్ క్యారెక్టర్ లో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో సమంత, అదాశర్మ ఇప్పటికే హీరోయిన్లుగా ఎంపిక కాగా.., మూడవ హీరోయిన్ కోసం అన్వేషణ జుగుతోంది. సినిమాకు దేవి సంగీతం అందిస్తున్నాడు. కాగా జులాయిని నిర్మించిన రాధాకృష్ణ దీనికి కూడా నిర్మాత.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  body weight loss  trivikram srinivas  latest news  

Other Articles