ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నారా చంద్రబాబునాయుడు.. ఒక్కసారిగా ఆయన పాలిటిక్స్ నుంచి తన దృష్టిని ఒక రౌడీ ఫెలో మీద కేటాయించినట్లు తెలుస్తోంది. అతని కోసం ఆయన అప్పుడే హంగామా మొదలుపెట్టినట్టు జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. దీంతో ఈ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. చంద్రబాబు ఎందుకు ఒక రౌడీ కోసం ఇలా తర్జనభర్జన పడుతున్నారు..? అసలు ఎవరా రౌడీ..? ఇన్నాళ్లవరకు తెరమీదకు రాని అతని పేరు.. ఇంత సడెన్ గా ఎందుకు వచ్చిందంటూ సందేహాల్లో మునిగిపోయారు. అయితే ఆ రౌడీ ఫెలో మరెవరో కాదు.. బాబుగారి మేనల్లుడు ‘‘నారా రోహిత్’’!
ఎన్నో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘‘ప్రతినిధి’’ మూవీ డిజాస్టర్ కావడంతో ఫ్లాప్ హీరోగా ముద్రవేసుకున్న నారా రోహిత్... ఎలాగైనా తన ఖాతాలో ఒక విజయాన్ని వేసుకోవాలనే ఉద్దేశ్యంతో తన తాజా మూవీకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే.. చాలా గ్యాప్ తర్వాత అతను దర్శకుడు కృష్ణచైతన్యతో కలిసి ఓ వెరైటీ కథాంశంతో ‘‘రౌడీ ఫెలో’’గా తెరముందుకు రాబోతున్నాడు. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్స్ తో కూడిన అన్ని ఎలిమెంట్స్ ను ఇందులో జోడించినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ గా విశాఖ సింగ్ నటిస్తోంది. ఇప్పటికే దాదాపు ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ హైదరాబాద్ ల్ జరుగుతోంది. సెప్టెంబర్ 13వ తేదీ వరకు జరుగనున్న ఈ షెడ్యూల్లో రెండు పాటలను షూట్ చేస్తున్నారు.
ఇదిలావుండగా.. ఈ మూవీ ఆడియోను చాలా గ్రాండ్ గా విడుదల చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 13వ తేదీన జెఆర్సీ కన్వెన్షన్ హాల్ లో జరగనున్న ఈ వేదికకు ముఖ్య అతిథిగా ఆంధ్రసీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారని తెలుస్తోంది. (‘‘ప్రతినిధి’’ ఆడియో వేడుకకు కూడా బాబు హాజరయ్యారు.) అలాగే మరికొంతమంది సినీప్రముఖులు కూడా ఇందుకు హాజరయ్యే అవకాశం వుంది. ఈ మూవీలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇందులో ఎన్టీఆర్ పాటను రీమిక్స్ చేశారు. ‘‘భలే తమ్ముడు’’లోని ‘‘ఎంతవారుగాని.. వేదాంతులైనాగాని.. వాలు చూపు తాకగానే’’ పాటను ‘‘రౌడీ ఫెలో’’ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని దర్శకనిర్మాతలు వెల్లడిస్తున్నారు.
కృష్ణచైతన్య దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ మూవీని మూవీమిల్స్ పతాకంపై ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీకి సన్నీ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మీద నారారోహిత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఎలాగైనా విజయం సాధించాలనుకుంటున్నాడు. అటు విశాఖసింగ్ కూడా ఈ సినిమాతో టాలీవుడ్ లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more