Megastar chiranjeevi suggestions to movie script writers

megastar chiranjeevi, former central minister chiranjeevi, chiranjeevi latest interview, chiranjeevi latest news, chiranjeevi news, tollywood megastar, tollywood heroes, telugu movie script writers

megastar chiranjeevi suggestions to movie script writers

సినిమా రైటర్లకు చిరు ‘‘పంచ్’’ డైలాగులు!

Posted: 09/08/2014 12:14 PM IST
Megastar chiranjeevi suggestions to movie script writers

(Image source from: megastar chiranjeevi suggestions to movie script writers)

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏది, ఎప్పుడూ, ఎలా చేసినా దానికో ప్రత్యేకత వుంటుందనేది అందరికీ తెలిసిన విషయమే! ఆయన ఏదైనా కార్యక్రమాన్ని తెరలేపడానికి ముందే ఎన్నో జాగ్రత్తలను పాటించిన అనంతరం మొదలుపెడతారు. ఇది ఇప్పటినుంచే కాదు.. ఆయన చిత్రపరిశ్రమలో రాకముందు ఆచరిస్తున్న ఏకైక సూత్రమిది! ఈ విషయాన్ని చిరు స్వయంగా మీడియాముందు చాలాసార్లు ప్రవేశపెట్టారు కూడా! అలాగే ఈసారి కూడా ఆయన తన 150వ చిత్రంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలాగ్యాప్ తీసుకున్న అనంతరం సిల్వర్ స్ర్కీన్ పై మళ్లీ కనువిందు చేయడానికి సిద్ధమైన చిరు.. తన మూవీ కథ, డైరెక్టర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలుస్తోంది.

అంతెందుకు.. చిరంజీవి అప్పట్లో సినిమాలు చేసిన ప్రతి క్యారెక్టర్ వెనుక చాలా శ్రమ కనిపించేది. ఆయన మేనరిజమ్, హావభావాలు ఎంతో ప్రత్యేకంగా వుండటం వల్లే ఆయనకు లక్షలాది అభిమానులు పుట్టుకొచ్చారు. అయితే ఇదంతా కేవలం ఆయన క్రెడిట్ మాత్రమేనంటూ అప్పట్లో ఈయన చిత్రాలకు కథలు అల్లిన రైటర్స్, డైరెక్టర్స్ ఇప్పటికీ అంటుంటారు. ఎందుకంటే.. ఏవిధంగా అయితే కథలో పాత్రలను అమరుస్తారో.. అంతకు రెండింతలు ఎక్కువగా ఆయన తన ప్రతిభతో సదరు పాత్రకు సరైనా న్యాయం చేసేవారని అందరూ అంటుంటారు. ఈ విషయంలో చిరు కూడా ఒక స్మాల్ ఎక్స్ ప్లనేషన్ కూడా ఇచ్చుకున్నారు. అదేమిటంటే...

‘‘రౌడీ అల్లుడు చిత్రం తీస్తున్న నేపథ్యంలో స్ర్కిప్ట్ రాస్తున్నప్పుడు రచయితలు సత్యానంద్, జంధ్యాల, వాళ్ల అసోసియేట్స్ తో పాటు నన్ను కూడా కథాచర్చలకు పిలిచేవారు. అందరూ కలిసి ఒక టీమ్ వర్క్ గా చేసేవాళ్లం. అందులో నాకు తోచిన ఇన్ ఫుట్స్ ఇచ్చేవాడిని. అలాగే వారికి తోచిన ఇన్ పుట్స్ జోడించి ఫైనల్ గా ఒక అద్భుతమైన తగ్గట్టు క్యారెక్టర్లను సృష్టించేవాళ్లం. అందుకే అప్పటి క్యారెక్టర్లూ, సినిమాలు చాలా బాగా వచ్చేవి. సక్సెస్ రేట్ కూడా ఎక్కవగా వుండేది. అప్పుడు టీమ్ వర్క్ చేయడం వల్లే మంచి ఔట్ పుట్స్ వచ్చేవి. కానీ ఈతరం వాళ్లకు ఇది సాధ్యం కాదు. ఎందుకంటే.. ఇప్పుడులాగు సీక్రెట్ గా రైటర్ ఏదో స్టోరీ రాసుకొచ్చి, డైరెక్టర్ ను ఇంప్రెస్ చేసి అన్నట్లు వుండేది కాదు. కనీసం పక్కోడితో స్టోరీ డిస్కస్ చేసే ఓపెన్ మైండ్ ఎవ్వరికీ లేదు. అందువల్లే ఇన్ పుట్స్ వుండవు. దాంతో ఆటోమెటిక్ గా సక్సెస్ రేట్ పడిపోయింది’’ అంటూ ఆయన నేటి మూవీ రైటర్లకు పంచ్ డైలాగులు ఇచ్చుకున్నారు.

ఇక్కడ చిరంజీవి అన్నమాటలు నూటికి నూరుశాతం కరెక్టే కదా! ఎందుకంటే.. రెండు చేతులు కలిపితేనే చప్పట్లు! అలాగే టీమ్ వర్క్ వుంటేనే ఏదైనా సాధ్యపడుతుంది. అందులో వున్న లోపాలను సవరించుకుని, ఆ స్థానంలో ఇతర అంశాలను జోడించుకోవడానికి వీలుగా వుంటుంది. కానీ ప్రస్తుతకాలంలో రైటర్లు మాత్రం తమ స్టోరీ వేరేవాళ్లు ఎక్కడ కాపీ కొట్టేస్తారేమోనన్న భయంతో ఎవ్వరితో చెప్పుకోకుండా డైరెక్ట్ దర్శకులకు అమ్ముకుంటున్నారు. అంతేకానీ.. అందులో ఇతరుల సహాయంతో ఇన్ పుట్స్ జోడించి డెవలప్ చేయాలని చూడటం లేదు. అందువల్లే.. ఒకే కథాంశంతో సినిమాలను రిపీట్ చేసి పారేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles