Adah sharma in allu arjun s movie

adah sharma, actors, actress, adah sharma hot, adah sharma latest photos, actress hot images, allu arjun, allu arjun movies, latest news, tollywoood, trivikram srinivas

adah sharma acting with allu arjun in his next movie : trivikram srinivas and allu arjun doing a movie adah sharma is heroine in the movie

ఇన్నాళ్ళకు ఆ కోరిక తీర్చుకుంటున్నా

Posted: 09/07/2014 06:01 PM IST
Adah sharma in allu arjun s movie

అల్లు అర్జున్ సినిమాలో నటించాలన్న తన కోరిక తీరిందని చెప్తోంది అదా శర్మ. అల్లు అర్జున్ -త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రానున్న తాజా సినిమాలో అదా శర్మ హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిందట. దీంతొ ఆనందానికి  హద్దేలేదని చెప్తోంది అమ్మడు. జులాయి సినిమా చూసినప్పటి నుంచి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎప్పుడు సినిమా చేస్తానా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఇన్నాళ్ళకు ఈ ఆఫర్ రావటంతో సంతోషం పట్టలేకపోతుందట.

ఇక ఇంతకంటే సంతోషం ఏంటంటే.., బన్ని పక్కన నటించటం అని చెప్తోంది. అల్లు అర్జున్ సూపర్ యాక్టరే కాదు.. డాన్సర్ అని పొగిడేస్తుంది. అభిమాన నటుడితో నటించటం పట్ల ఈ అమ్మడు సంతోషం వ్యక్తం చేసింది. ఈ  ఫర్ రావటం పట్ల థ్రిల్ అయినట్లు చెప్తోంది. ముగ్గురు హీరోయిన్లు ఉండే ఈ సినిమాలో ఇప్పటికే సమంతకు బెర్త్ కన్మర్మ్ అయింది. ఇప్పుడు అదా శర్మ కూడా టికెట్ బుక్ చేసుకుంది.

జులాయి తర్వాత అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది. సెప్టెంబర్ చివర్లో సినిమా సెట్ పైకి వెళ్ళనుంది. జులాయిని అందించిన రాధాకృష్ణ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ఇక  దేవిశ్రీ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నెగిటివ్ రోల్ లో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  trivikram  adah sharma  tollywood  

Other Articles