Ice cream 2 movie hot song released

ice cream, ice cream2, ice cream2 hot song, kiss me every where song, ram gopal varma, ramgopal varma movies, latest movies, horror movies, devils, tollywood news, latest news

ice cream2 movie hot song released on satur day : kiss me every where song in icecream2 movie released

ఐస్ క్రీం2 హాట్ సాంగ్ విడుదల

Posted: 08/30/2014 05:25 PM IST
Ice cream 2 movie hot song released

ఐస్ క్రీం తినాలంటే భయపడేలా చేసిన రాం గోపాల్ వర్మ మరో సెన్సేషన్ ఐస్ క్రీం 2 త్వరలో తెరకెక్కనుంది. ఈ సినిమా తొలి సాంగ్ శనివారం లాంచ్ అయింది. కార్యక్రమంలో వర్మతో పాటు జెడి, నందు, సిద్దు, భూపాల్, జీవా, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ ‘కిస్ మి ఎవ్రి వేర్’ పాట ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని సినిమా యూనిట్ భావిస్తోంది. పాట అంతా ఆంగ్లపదాలే ఉన్నాయి. భీమవరం టాకిస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకులను భయపెడుతుందని సమాచారం.

ఇక పాట రిలీజ్ సందర్బంగా స్పందించిన వర్మ.., ఈ సినిమాకు ముందుకు వచ్చిన ఐస్ క్రీం తో ఎలాంటి సంబంధం ఉండదన్నారు. తొలి సినిమాలో ఉపయోగించిన సౌండ్, కెమెరా టెక్నాలజి కేవలం టెస్ట్ మాత్రమే అని.., పూర్తిగా ఈ సినిమాలో వాడుతున్నట్లు చెప్పారు. ఇక సినిమా పూర్తిగా ఔట్ డోర్ షూటింగ్ జరుపుకుందన్నారు. చల్లగా ఐస్ క్రీం తినాలనుకునే వారికి వణుకుపుట్టించేలా సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన రాం గోపాల్.., 2లో ఏం చూపిస్తాడా అని సినిమా వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ice cream2  hot song  ram gopal varma  latest news  

Other Articles