Rajmouli copied scene from vijayashanti shabhavi ips movie in vikramarkudu

rajamouli, rajamouli latest news, rajamouli vikramarkudu movie, vikramarkudu movie news, vikramarkudu news, vikramarkudu movie scenes, raviteja vikramarkudu

rajmouli copied scene from vijayashanti shabhavi ips movie in vikramarkudu

మక్కీకి మక్కి మొత్తం కాపీ కొట్టి దించేసిన రాజమౌళి!

Posted: 08/29/2014 04:46 PM IST
Rajmouli copied scene from vijayashanti shabhavi ips movie in vikramarkudu

(Image source from: rajmouli copied scene from vijayashanti shabhavi ips movie in vikramarkudu)

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కొన్ని కొన్ని సన్నివేశాలను హాలీవుడ్ చిత్రాల నుంచి కాపీ కొడతాడని అందరికీ తెలిసిందే! అయితే కాపీ కొట్టిన ఆ సన్నివేశాలను కొంచెం స్మార్ట్ గా చేసి సరికొత్త యాంగిల్ లో ప్రేక్షకులకు కనువిందు చేయిస్తాడు. సన్నివేశాల కాపీ కొట్టినట్టు అందరికీ తెలిసినా.. వాటిని గుర్తుపట్టడంలో కొంచెం ఆలస్యం మాత్రం అవుతుంది. ఇంతవరకు ఈయన తెరకెక్కించిన సినిమాలన్నింటిలోనూ ఏదో ఒక సన్నివేశం ఖచ్చితంగా కాపీ కొట్టితీరిందే! కానీ ఈ ట్రెండ్ కు తగ్గట్టు వాటిని తెరకెక్కించడంతో అంతగా పట్టించుకోవడం లేదు!

ఇందులో భాగంగానే.. ‘‘ఈగ’’ సినిమాలో ‘‘నేను నానీని.. మళ్లీ పుట్టాను’’ అని సమంత కన్నీటితో ఈగ రాసే సన్నివేశం హాలీవుడ్ చిత్రం నుంచి స్ఫూర్తి పొందిందే! అలాగే ‘‘ఛత్రపతి’’ టైటిల్ సాంగ్ ఒక జపనీస్ కామిక్ షో నుంచి తీసుకొచ్చింది. ‘‘సై’’ క్లైమాక్స్ సన్నివేశంలో విలన్లందరూ గుంపుగా చేరి పాడే పాట కూడా సేమ్ టు సేమ్ ఒక హాలీవుడ్ చిత్రం నుంచి కాపీ కొట్టిపారేశారు. అలాగే ‘‘మగధీర’’ సినిమాలో వందమందిని చంపే థియరీని మొత్తం చైనా మూవీ నుంచి ఎత్తుకొచ్చించే మరి! అంతెందుకు.. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ‘‘బాహుబలి’’ వీడియో ఫార్మాట్ కూడా మొత్తం కాపీ కొట్టిందే! అయితే ఆ వీడియో రైట్స్ ని డబ్బులిచ్చి కొన్నామంటూ యూనిట్ చెప్పడంతో ఆ వివాదం అంతటితో ఆగిపోయింది. ఈ మొత్తం సినిమాల్లో కాపీ కొట్టిన సన్నివేశాలను రాజమౌళి ఒక సరికొత్త యాంగిల్ లోనే చూయించి.. ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసేశాడు. కానీ ఒక్క సినిమాలో మాత్రం మక్కీకి మక్కి దించేసి.. వార్తల్లోకెక్కాడు జక్కన్న!

రవితేజ - జక్కన్న కాంబినేషన్ లో వచ్చిన ‘‘విక్రమార్కుడు’’ సినిమా అందరికీ గుర్తే వుంటుంది. ఆ సినిమాలో పోలీస్ పవరెంటో రాజమౌళి సరికొత్త యాంగిల్ లో చూపించి.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేశాడు. అయితే ఈ సినిమాలో వున్న ఒక సన్నివేశం టోటల్ గా కాపీ, పేస్ట్ చేసిన సంగతి మాత్రం అప్పట్లో ఎవ్వరూ గుర్తించలేకపోయారు. కానీ ఇన్నాళ్ల తర్వాత అది బయటపడింది. డైలాగులతో సహా మొత్తం సన్నివేశాన్ని యాజ్ ఈజ్ టీజ్ గా దించిపాడేశాడు రాజమౌళి!

‘‘విక్రమార్కుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లో అంటే రవితేజ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో వున్నప్పుడు.. విలన్ కొడుకుని జైలుకి తీసుకెళ్తాడు. కానీ అతనికి పిచ్చని నమ్మించి విడుదల చేయించి.. రాథోడ్ (రవితేజ)ను పార్టీకి పిలిపించి.. అక్కడ అతణ్ణి అవమానపరిచేందుకు విలన్ ప్లాన్ చేస్తాడు. ఆ క్రమంలోనే సాగుతుండగా.. హీరో తెలివితేటలతో అతడ్ని పైకిపంపించేస్తాడు. ఇది ఆ సినిమాలో సన్నివేశం..! మరి ఈ సన్నివేశం కాపీ కొట్టి ఏ హాలీవుడ్ మూవీ నుంచో కాదు.. గతంలో విజయశాంతి నటించిన ‘‘శాంభవి ఐపీఎస్’’ సినిమా నుంచి! అంతగా అనుమానంగా వుంటే.. ఈ క్రింది వీడియోను చూడండి..

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajamouli  vikramarkudu  raviteja  vijayashanti  shambhavi ips movie  

Other Articles