Arjun kapoor hates sridevi

Sridevi will always be my dad's wife, Arjun Kapoor talks about sridevi, Arjun Kapoor says Sridevi is only his father's wife, Arjun Kapoor opens up about Sridevi, sridevi arjun kapoor cold war, Arjun Kapoor, sridevi, bollywood

Arjun Kapoor spoke candidly on Karan Johar's chat show and said that his relationship with Sridevi is complicated.

శ్రీదేవి బోనీ భార్య మాత్రమే... ఐ హేట్ శ్రీదేవి

Posted: 08/05/2014 10:20 AM IST
Arjun kapoor hates sridevi

బాలీవుడ్ లో అగ్ర నిర్మాత అయిన బోనీ కపూర్, హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి మొదటి భార్య మోనాకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మోనా కొడుకే ప్రస్తుత బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. అయితే అర్జున్ కు శ్రీదేవి అంటే ఇష్టం లేదని గతంలో చాలా సార్లు చెప్పాడు. కానీ వీరిద్దరి మధ్య మళ్లీ మంచి అనుబంధం ఏర్పడిందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

శ్రీదేవి కారణంగానే తనను వదిలేసాడని, శ్రీదేవి కావాలనే తన భర్తను వలలో వేసుకుందని అప్పట్లో మోనా చాలా భాధపడినట్లుగా వార్తలొచ్చాయి. తన తల్లికి శ్రీదేవి ద్రోహం చేసిందని బలంగా నమ్ముతున్నాడు కాబట్టే ఆమె అంటే కోపంగా ఉన్నాడు. పైగా తనకు పిన్ని అయిన శ్రీదేవిని ఆమె ఎవరో తెలియదు, ఆమెకి నాకు ఎటువంటి బంధుత్వం లేదు అని అంటున్నాడు. అయితే అర్జున్ దగ్గర తన పిన్ని శ్రీదేవి గురించి మాట్లాడితే చిర్రెత్తుకొచ్చెది. అయితే తాజాగా ఆ కోపాన్ని బయటకు చెప్పేసాడు.

అర్జున్ దగ్గర శ్రీదేవి గురించి ప్రస్తావించగా... ‘శ్రీదేవి ఎప్పటికీ బోనీ కపూర్ భార్య మాత్రమే... తనకు శ్రీదేవి అంటే నచ్చదని’ కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేసాడు. శ్రీదేవి వద్ద కూడా అర్జున్ గురించి ఎప్పుడు ప్రస్తావించినా కూడా ‘నో కామెంట్’ అని మాత్రమే సమాధానం వస్తుంది. మరి వీరిద్దరు భవిష్యత్తులో కలుస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjun Kapoor  Sridevi  Arjun Kapoor Sridevi news  sridevi boney kapoor  

Other Articles